సుప్రసిద్ద వాక్యాలు - పూర్తి శ్లోకార్థాలు - 1
కామాతురాణాం నభయం నలజ్జా
శ్లోకం:
అర్థాతురాణాం నగురుర్నబంధు:, కామాతురాణాం నభయం నలజ్జా !
విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధా తురాణాం నరుచిర్నపక్వం !!
తాత్పర్యము:
ధనాశాపరులకు గురువు, బంధువుల పట్టింపు లేదు, కామం కళ్ళకెక్కిన వాడికి భయమూ, సిగ్గు ఉండదు. విద్యాపేక్ష కలవానికి సుఖము, నిద్ర ఉండదు. ఆకలిగొన్న వానికి రుచి గూర్చి, ఉడకటం గురించి ఆలోచన ఉండదు.
ధనాశాపరులకు గురువు, బంధువుల పట్టింపు లేదు, కామం కళ్ళకెక్కిన వాడికి భయమూ, సిగ్గు ఉండదు. విద్యాపేక్ష కలవానికి సుఖము, నిద్ర ఉండదు. ఆకలిగొన్న వానికి రుచి గూర్చి, ఉడకటం గురించి ఆలోచన ఉండదు.
కృషితో నాస్తి దుర్భిక్షం
శ్లోకం:
కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం !
మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం !!
తాత్పర్యము:
కృషి చేసుకునే వానికి కరువులేదు, జపం చేసుకునే వానికి పాపము లేదు, మౌనంగా ఉండేవాడికి కలహము లేదు, మేల్కొని ఉండే వాడికి భయమే లేదు.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
శ్లోకం:
సర్వస్య గాత్రస్య శిర: ప్రదానం, సర్వేంద్రియాణాం నయనం ప్రదానం !
షణ్నాం రసానం లవణం ప్రధానం, భావవేన్నదీనాముదకం ప్రధానం !!
తాత్పర్యము:
దేహానికి శిరస్సు ప్రధానం, ఇంద్రియాలలో కన్నులు ప్రధానం, ఆరు రసాలలో ఉప్పు ప్రాధానం, నదులకు ఉదకము ప్రధానము.
ధనమూలమిదం జగత్
శ్లోకం:
వేదమూలమిదం బ్రాహ్మ్యం, భార్య మూలమిదం గృహం !
కృషిమూలమిదం ధాన్యం, ధనమూలమిదం జగత్ !!
తాత్పర్యము:
బ్రాహ్మణులకు వేదమే మూలము, గృహమునకు భార్యయే మూలము, ధాన్యమునకు కృషి మూలము అలాగే జగత్తునకు ధనమే మూలము.
ఋణానుబంధ రూపేనా పశుపత్నీ సుతాలయా:
శ్లోకం:
ఋణానుబంధ రూపేణ పశుపత్నీ సుతాలయా: !
ఋణక్షయే క్షయంయాంతి కాతత్ర పరివేదనా !!
తాత్పర్యము:
పశువులు, భార్యాపిల్లలు ఋణానుబంధం వలన కలుగుచున్నారు. ఆ ఋణము తీరిన తరువాత అవి నశించుచున్నవి (దూరమగు చున్నవి), కాబట్టి వాటిని గూర్చి వేధనపడ తగదు.
ధన్యవాదాలు, వీటిని కాపీ చేసుకుంటున్నా.
ReplyDeleteనా బ్లాగులోని ఏ విషయాన్నైనా ఎవరైనా స్వేచ్చగా కాపీ చేసుకోవచ్చు
Deleteచెప్పడం సభ్యత కదా!
Deleteఋణానుబంధ రూపేనా పశుపత్నీ సుతాలయా: !
ReplyDeleteఋణక్షయే క్షయంయాంతి కాతత్ర పరివేధనా !!
తప్పొప్పులు: 'రూపేనా' బదులు 'రూపేణ' అని ఉండాలి. అలాగే 'పరివేధనా' కాక 'పరివేదనా' అని ఉండాలి.
మీరన్నది నిజమే అవి ఆంగ్లంలో టైపు చేసినపుడు తెలుగులో కొంచెం తేడాలతో తర్జుమా అవుతున్నవి. సరిచూసుకోలేదు, తెలిపినందుకు ధన్యవాదాలు.
DeleteYes, a real pain with phonetic typing in Telugu on an English keyboard. Thelugu keyboards no less pains either. Some have quite funny layouts and make you type even more keys.
Delete