Telangana Words are Telugu Old Words
తెలంగాణా భాష కొందరికి వింతగా అనిపించి హేళన చేసినా తెలంగాణాలో వాడబడే ఎన్నో పదాలు అచ్చ తెలుగుపదాలని, ప్రాచీనమైనవి అని ఇంతకుముందు రెండు టపాల్లో నేను రాయటం జరిగింది.
తెలంగాణా పదాలు అతి ప్రాచీన పదాలు అని వివరిస్తూ శ్రీ కందాళ వేంకట నరసింహాచార్యులు గారు సుజాత పత్రికలో 1950లో రాసిన వ్యాసాన్ని ఇక్కడ యథాతథంగా ఉంచుతున్నాను.
వారు ఆ కాలంలోనే తెలంగాణా భాషను అవహేళన చేయడాన్ని విమర్శిస్తూ ఈ పదాలు ప్రాచీన పదాలని ఉదాహరణ యుక్తంగా తెలియజేశారు. ఈ వ్యాసంలో వారు వివరించిన కొన్ని తెలంగాణా వాడుక పదాలు (బ్రాకెట్ లో రాయబడినవి - వాటి సమానార్థ వాడుక పదాలు):
1. అరుసుకోనుట (పరమార్శించుట)
2. అక్కల (అక్క)
3. దొబ్బుట (త్రోయుట)
4. మొగులు (ఆకాశం)
5. పెయి/పెయ్యి (శరీరం)
6. కడప (గడప)
7. బాగాలు (పోకలు)
8. బోనాలు (భోజనము-నైవేద్యం)
9. దంగు (నలుగు)
10. ఏరాలు (తోడికోడలు)
11. తాన (దగ్గర, వద్ద)
12. లెస్స (అధికము)
13. బిరాన (తొందరగా)
14. అమడలు/అమ్డాలు (కవలలు)
15. కొండెంగ (కొండముచ్చు)
16. చికినీ/చికినము (పోక చెక్క)
17. పోలెలు (పూర్ణాలు, భక్ష్యాలు)
18. బాసానులు (వంట పాత్రలు)
19. ఉద్దెర (అప్పు)
20. మక్కులు/మక్కలు (మొక్క జొన్నలు)
సుజాత పత్రికవారికి ధన్యవాదములతో