Showing posts with label తెలంగాణా వారు రాహు కాలం పాటించాలా?. Show all posts
Showing posts with label తెలంగాణా వారు రాహు కాలం పాటించాలా?. Show all posts

Wednesday, 16 October 2013

తెలంగాణా వారు రాహు కాలం పాటించాలా?

రాహు కాలం అనేది తెలంగాణా ప్రాంతంలో వెనకటి నుండి ఆచారంలో లేదు - ఇప్పుడు కూడా లేదు కూడా
ఈ ఆచారం ప్రధానంగా తమిళ నాట ముందు నుండీ ఉంది.
ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో తమిళులతో జీవనం సాగించి వచ్చిన ఆంద్ర పండితుల వలన
తెలంగాణాలో కూడా ప్రవేశించటం జరిగింది.

తెలంగాణలో ప్రచురించ బడిన కోస్గి పంచాంగం మొదలుగా గల పంచాంగాలలో గాని
తెలంగాణలో ప్రచురించబడిన జ్యోతిష్య గ్రంధాలలో కాని రాహుకాలం చర్చ లేదు.

ప్రస్తుతం తెలంగాణా ప్రాంతంలో రాహుకాలం వాడుకలో లేదు
ఎవరైనా పంచాంగ కర్తలు / కేలెండర్ పంచాంగ కర్తలు అందరికీ అన్ని విషయాలు అందుబాటులో ఉండాలి
అని ఇవ్వటం తప్ప - వాటిని తప్పక ఆచరించాలి అని ఇవ్వటం లేదు

ఇక రాహుకాలం ప్రస్తావన తెలుగు పండితులలో/పంచాంగాలలో వచ్చింది పూర్తిగా నవీనం
ప్రాచీనకాలం నుండి రాహుకాలం ప్రస్తావన లేదు

జ్యోతిష్య/ధర్మ గ్రంధాలలో ప్రధానమైనవిగా చెప్పబడే
ధర్మసిందు, నిర్నయసిందు లలో 
కాలామ్రుతం,  ముహూర్తమార్తాండం, ముహూర్త చింతామణి, ముహూర్త దీపికలలో 
భ్రుగు, వశిష్ట, నారద, గార్గ సంహితలలో గాని
రాహుకాలం గురించి చెప్పబడలేదు.

ఇంకా చాంద్రమానాన్ని పాటించే తెలుగు వారికి వర్జ్యమే ప్రధానం - రాహుకాలం చెప్పబడలేదు

ప్రధానంగా జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్న ఏకవింశతి (21) మహాదోషాలలో రాహుకాలం చెప్పబడలేదు.
ఏకవింశతి మహాదోషాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

నిజానికి ప్రధానంగా రాహువును  ఒక ఛాయా గ్రహంగానే ప్రాచీన జ్యోతిష్య శాస్త్రాల్లో ప్రస్తావించటం జరిగింది
దానికి విశేష ప్రాధాన్యం కూడా ఇవ్వబడలేదు  అన్నది సత్యం
అయితే
మనిషి ఆలోచనతో బాటు పెరుగుతున్న ఆశలతో వచ్చి చేరుతున్న కొత్త కొత్త కథనాలు జ్యోతిష్య శాస్త్రంలో కోకొల్లలు.
వాటిలో ఈ రాహుకాలం ఒకటి 
 
కాలక్రమంలో వచ్చి చేరుతున్న, తెలంగాణాలో ఆచరణలో లేని ఇలాంటి నవీన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు - వాటిని పాటించక పోవుట విషయంలో సందేహమూ అక్కరలేదు. 
రాహు కాలంలో ఏదైనా శుభ కార్యం చేస్తే చెడుతుందేమో అన్న మీమాంస అక్కరలేదు
అలా అనుకుంటే తరాల నుండీ మన పెద్దలు పెట్టుకుంటూ వచ్చిన శుభ ముహూర్తాల నన్నిటినీ తప్పు పట్టాల్సిన దేనా?
వారు పెట్టిన కార్యాలు శుభాల నివ్వలేవా?

ఇక రాహుకాలం నేను పరిగణిస్తాను - పాటిస్తాను అనేవారిని తప్పు పట్టాల్సిన పని కూడా లేదు
ఎవరి స్వఅభిప్రాయం వారిది - ఎవరి నమ్మకం వారిది
అయితే మన తెలంగాణాలో కాని/తెలుగు వారి ఆచారాల్లో కాని రాహుకాలం చెప్పబడలేదు.