Monday, 29 January 2018

ప్రాచీన కావ్యాల్లో తెలంగాణా పదాలు

తెలంగాణా పదాలు అతి ప్రాచీనమైన తెలుగు పదాలు, ఈ విషయమై ఇంతకు ముందు నేను కొన్ని టపాలు రాయటం కూడా జరిగింది.  అవి:

తెలంగాణా పదాలు - అతి ప్రాచీన తెలుగుపదాలు 

తెలుగుభాషకు పుట్టిల్లు తెలంగాణా 

తెలుగులో అంటే తిట్టు సంస్కృతంలో అంటే సంస్కారమా! 


వాటికి కొనసాగింపుగా ఈ టపాలో శ్రీ ఓగిరాల సుబ్బారావు గారు తెలంగాణా భాష యొక్క ప్రాచీనతను, గొప్పతనాన్ని తెలుపుతూ భారతి పత్రికలో (1949) రాసిన "తెలంగాణము - భాషా విశేషములు"  అనే వ్యాసమును యథాతథంగా ఇక్కడ ఉంచుతున్నాను. 

ఈ వ్యాసంలో సుబ్బారావు గారు "టేడీ, బేడీ జబాన్ తెలంగీ" అంటూ తెలంగాణా భాష ఎలా పరిహాసానికి గురైందో వివరించారు. ఆయా తెలుగు ప్రాంతాల్లో ఆయా రాజుల ప్రభావాల వలన (రాజభాషా ప్రభావం) అచ్చ తెలుగు భాష తన ప్రాభవాన్ని కోల్పోయింది. కొన్ని చోట్ల ప్రాకృత భాషా ప్రభావం, మరికొన్ని చోట్ల సంస్కృత ప్రభావం, మరికొన్ని చోట్ల తమిళ, కన్నడ, ఉర్దూ భాషల ప్రభావాల వలన తెలుగు భాష తన నిజస్వరూపాన్నే కోల్పోయింది. తెలుగు ఆది కావ్యంగా గుర్తింపబడ్డ నన్నయ మహాభారతం అధికంగా సంస్కృత, ప్రాకృత పదాలతోనే నిండిపోయింది, ఆ తరువాత కూడా ఎంతోమంది ప్రాచీన రచయితల నుండి నవీన రచయితల వరకు తెలుగు పదాల పక్కన పడేసి అన్యభాషలు ప్రభావంతో ఏర్పడిన తెలుగునే వెలుగులోకి తేవడం జరిగింది. పాల్కురికి సోమనాథుని వంటివారు కొంతవరకు అచ్చ తెలుగు పాదాలకు ప్రాధాన్యత నిచ్చినా అవి ప్రామాణిక తెలుగుభాష  కాలేకపోయాయి. సుబ్బారావు గారు ఈ వ్యాసంలో చెప్పినట్టు "ప్రామాణిక భాష, మాండలిక భాష అనే రెండు పొరలను కల్పించారు. ఈ పొరల వల్ల నేడు ప్రాంతీయ భాషలు కృతకభాషలు అనే విమర్శనము బయలుదేరినది." అంతేగాక సుబ్బారావు గారు ఈ వ్యాసంలో పేర్కొన్న ప్రధానాంశం ఇక్కడ గమనించదగ్గది : "అన్యభాషల ప్రభావం వలన తెలంగాణా తెలుగు భాష చెడిపోయినట్టిదైనా నేటి వ్యవహారికంలోని (తెలంగాణా వారి వాడుకలోనూ ) తెలంగాణా తెలుగు భాష, ప్రాచీనమైన మహాభారతాది గ్రంధాల పదాలతో కొంత ఐక్యత కలిగి దేశీయతను పొంది ఉన్నది. అపరిమిత ప్రాకృత భూయిష్టమైన నేటి తెలుగునాటి తెలుగు (ప్రామిణికము అని మనము అనుకుంటున్న నేటి తెలుగుభాష)  ముందర అచ్చతెలుగు  తెలంగాణా "ప్రాదెలుగు" (అనగా ప్రాచీనమైన తెలంగాణా తెలుగు) కొత్తగా అగుపడుటలో వింతలేదు." అంటూ సుబ్బారావుగారు నేటి వ్యవహారంలో తెలంగాణా పదాలను ప్రాచీన కావ్యాల భాషతో సరిపోలుస్తూ తెలంగాణా భాష యొక్క ఔన్నత్యాన్ని చాటాడు. 

భారతి పత్రిక వారికి ధన్యవాదములతో 








~ : ~ 

2 comments:

  1. తెలంగాణా మాండలిక ప్రామాణికతను సోదాహరణంగా నిరూపించిన మంచి వ్యాసాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు సర్.అందరు తప్పక చదవాల్సిన వ్యాసం ఇది.

    ReplyDelete