Wednesday, 5 November 2014

డిసెంబర్ అంధకారం నిజమేనా?



డిసెంబర్ 2014, 16వ తేదీ నుండీ 22వ  తేదీ వరకు ప్రపంచంలో సూర్యుడు కనిపించక అంధకారం అలుముకుంటుందని వస్తున్న వార్త ఇంటర్నెట్ ప్రపంచంలోనే కాక మీడియా ప్రపంచంలో కూడా ఎక్కువగా వినబడుతుంది. ఈ వార్తను ప్రధానంగా ప్రముఖ వెబ్సైటు HUZLERS.COM లో (http://huzlers.com/nasa-confirms-earth-will-experience-6-days-total-darkness-december-2014/) ఉంచటం జరిగింది. అలాగే ఈ సైట్ ఫేస్బుక్ పేజీలలో కూడా ఈ వార్త ప్రపంచం మొత్తంగా సంచలనం సృష్టిస్తుంది.  ఈ వార్తను నాసా (NASA) వారు కూడా అంగీకరించారని ఈ వెబ్సైటులో పెట్టడం జరిగింది. 

ఇక ఈ సైట్ లో చెప్పబడినట్టు ఆ వార్తను నాసా వారు ధ్రువీకరించలేదని ఇది వట్టి గాలివార్తే అని  ప్రముఖ వెబ్సైటు INDEPENDENT.CO.UK లో (http://www.independent.co.uk/news/science/nasa-confirms-six-days-of-darkness-in-december-no-they-really-dont--its-a-hoax-9822744.html) చెప్పటం జరిగింది. 

అయితే డిసెంబర్ 21 తేదీ నాడు పగలు కొన్నిగంటలు మాత్రమే ఉంటుందని (సూర్యుని వెలుతురు భూమిపైన), రాత్రి ఎక్కువ గంటలు ఉంటుందని ప్రముఖ వెబ్సైటు EARTHSKY.ORG (http://earthsky.org/earth/everything-you-need-to-know-december-solstice)  వారు రాయటం జరిగింది. 

డిసెంబర్ లో 6 రోజుల అంధకారాన్ని కొట్టిపారేసినా సూర్య సంచారాన్ని బట్టి డిసెంబర్ 21 నాడు ఎక్కువగంటలు సూర్యుడు కనిపించకపోవటం అనేది జరుగుతుందని విశ్వసించవలసి వస్తుంది. ఇది కాలగమనంలో జరిగేదే కాబట్టి ఏదో దీనివల్ల జరిగిపోతుందని, సృష్టి వినాశనానికి దారితీస్తుందని చెప్పబడే విషయాలను నమ్మాల్సిన పనిలేదు. 

సహజంగా ఇలాంటి విషయాలను శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు  కాలజ్ఞానంలో ప్రస్తావిస్తూ ఉంటారు. వారు చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగిపోయి, ఎంతోమందిచే కాలజ్ఞానం విశ్వసించబడుతుంది కూడా. నేను ఈ విషయమై బ్రహ్మంగారి కొన్ని కాలజ్ఞాన విషయాలను పరిశీలిస్తే డిసెంబర్ 2014లో జరుగుతుందని చెప్పబడుతున్న విషయం నాకు కనిపించలేదు (బ్రహ్మంగారి చాలా కాలజ్ఞాన పత్రాలు ఇంకా లభ్యంగా లేవనే  విషయం మనం గుర్తుంచుకోవాలి). 

అయితే ఇలాంటి సంఘటనే రాబోయే కాలంలో కార్తీకమాసంలో సంభవిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఒక చోట చెప్పటం జరిగింది. చెప్తున్న డిసెంబర్ 2014 నాటికి కార్తీకమాసం ఉండటం లేదు. అదీకాక ఆ వాక్యాలు చెప్పబడిన సందర్భాన్ని బట్టి, సూర్యకాంతులు నేలను సోకని ఆ కాలం రావటానికి ఇంకా ఎంతో కాలం ఉందని అనిపిస్తుంది (ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించుకుంటే సైన్సు పరంగా కూడా అంతరిక్షంలో చేరుతున్న  చెత్తచేదారాల వల్లనైతేనేమీ భూమికి సూర్యుడికి మద్య ఏర్పడే దూరాన్ని బట్టైతేనేమీ కాలగమనంలో ఎప్పుడైనా జరిగే అవకాశాలు ఉన్నవి అనే చెప్పొచ్చు). బ్రహ్మంగారి ఆ కాలజ్ఞాన వాక్యాలను ఇక్కడ ఉంచుతున్నాను, గమనించగలరు. 

కాలపరిపశ్వాము జనులాకుముందార 
కార్తీకమాసములో కలిగీనిమా 
బాలచంద్రునికాంతి కాన బోయ్యీనీ
భానుకాంతులణగి పోయ్యీనిమా
శివగోవింద గోవింద హరిగోవింద గోవింద. 

ఈ టపా మూలంగా నేను చెప్పేదేమంటే డిసెంబర్ 2014 లో ఏదో జరిగిపోతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. 









No comments:

Post a Comment