Happened Kalajnana Words - America Supremacy
కలియందు శ్వేతముఖులు దొరలయ్యేరు
మెలకువతో రాజ్యమేలేరుమా
శివగోవింద గోవింద హరిగోవింద గోవింద.
వివరణ:
ఈ కలియుగంలో శ్వేతముఖులు (తెల్లముఖాల వారు) అనగా అమెరికాదేశంవారు ప్రపంచంలో అగ్రగాములవుతారని, "దొరలు" అంటే బాగా ధనవంతులు అవుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంతేగాక వారు ఎంతో చాకచక్యంతో ప్రపంచానికి ఆధిపత్యం వహించే విధంగా పరిపాలన సాగిస్తారని చెప్పటం జరిగింది. బ్రహ్మంగారి కాలంలో తెల్లవారు ప్రపంచాధిపత్యం వహించి ఉండలేరు. 18వ శతాబ్దం తరువాతనుండే వీరు కొంతకొంతగా ఆధిపత్యం వహించటం సాగించారు. ముఖ్యంగా రెండవ ప్రపంచయుద్ధం (1945) లో అమెరికాదేశం ప్రయోగించిన అణ్వాయుధాల తరువాతనే ప్రపంచం మొత్తం అమెరికా ఆదిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం అమెరికా వారి డాలర్ తోనే సరిపోల్చే స్థాయికి అమెరికా ఎదిగిపోయింది.
No comments:
Post a Comment