Monday, 3 November 2014

జరిగిన బ్రహ్మంగారి కాలజ్ఞాన వాక్యాలు - రైలు,బస్సుల వినియోగం

 Happened Kalajnana Words - Train,Vehicle Use 


శ్వేతముఖూలు ధూమశకటముల్ గల్పించి
భూతలమున నినుప కమ్మూలపై 
సూత్రమెరిగిన పశ్చిమొత్తరా దిశలందు
గాత్రముగా నడిపించేరుమా
శివగోవింద గోవింద హరిగోవింద గోవింద.  

తూర్పు పశ్చిములు దుంజాలచేతను
ధూమశకటంబులు తిరిగీనిమా 
శివగోవింద గోవింద హరిగోవింద గోవింద.  

వివరణ:
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి పై కాలజ్ఞాన వాక్యాలు రైలు వినియోగం గురించి చెప్పబడినవి. బ్రహ్మంగారి కాలానికి గుర్రాలు, మనుషులతో లాగబడే  రైలు లాంటి వాహనం కనుక్కోబడినట్లు ఇప్పుడు ప్రకటింపబడుతున్నా అప్పట్లో అది ప్రపంచానికి పరిచయంలేనిది. ఇనుప పట్టలపైన యంత్రసాయమున నడిచే (Mechanical Train) రైలు 1800 తరువాతనే వచ్చింది. "శ్వేతముఖూలు" అంటే తెల్లటిముఖాలు కలిగినవారు అనగా తెల్లవారు (యూరోపియన్స్). మొదట్లో రైలు బొగ్గువలన నడవడంచే విపరీతమైన పొగను వదులుతూ పరుగులు పెట్టేవి. అందుకే బ్రహ్మంగారు వీటిని "ధూమశకటములు" అని చెప్పారు. రైలు కూత శబ్దం కూడా ప్రత్యేకత కలిగినదే, అందుకే "గాత్రముగా" నడిపించేరు అని చెప్పారు బ్రహ్మంగారు. "తూర్పు పశ్చిములు దుంజాలచేతను ధూమశకటంబులు తిరిగీనిమా" అంటే అటూ ఇటూ రెండు ఇనుప కమ్మీలపైన రైలు తిరుగుతుంది అని అర్థం. 


హరి లోహ తామ్ర దారుశకటములపైని 
అన్ని జాతులొకటై అందులోను
స్వకులాచారముల్ దప్పి వకరిపైన
ఒకరుపైబడి వూళ్ళకురికేరుమా
శివగోవింద గోవింద హరిగోవింద గోవింద.  

వివరణ:
ఈ వాక్యాలు రోడ్డుపైన నడిచే వాహనాలకు సంబందించినవి. ఈ వాహనాలు బ్రహ్మంగారి తరువాతనే కనుక్కోబడ్డాయి, 1800 తరువాతనే వినియోగంలోకి వచ్చాయి. మొదట్లో ఈ వాహనాలు రకరకాల లోహాలతో తయారు చేసేవారు. నిజాంరాజు వంటివారు బంగారంతో తయారు చేయబడిన వాహనాలనూ ఉపయోగించారు. భారతదేశంలో స్వాతంత్ర్యం రాక, రాజ్యాంగం ఏర్పడక మునుపు వరకూ కులాచారాలు, ముట్టు-అంటు అనేవి ఎంతో వాడుకలో ఉండేవి. ఆ కాలంలో జాతి, కులమత భేదాలు లేక అందరూ కలిసి ఒకే వాహనంపైన ప్రయాణం చేస్తారనేది ఊహకు అందనిది. 

పై రెండు కాలజ్ఞాన వాక్యాలు బ్రహ్మంగారు ఆ కాలంలో  చెప్పటం అనేది ఆశ్చర్యపరచే విషయమే కాక అద్భుతమైనవి కూడా.  








No comments:

Post a Comment