Happened Kalajnana Words - World Wars
ధాత పార్థివ మద్య దేశాధిపతులెల్ల
పాతకంబగు యుద్దములు జేతురుమా
శివగోవింద గోవింద హరిగోవింద గోవింద.
వివరణ:
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి పై కాలజ్ఞాన వాక్యాలు అతి భయంకరంగా, హేయకరంగా, మహాపాతకంగా సాగిన రెండవ ప్రపంచయుద్దానికి సంబందించినవి. ధాత సంవత్సరం 1936 లో రాగా పార్థివ 1945 లో వచ్చింది ఈ మద్యకాలంలోనే రెండవ ప్రపంచ యుద్ధం భీకరంగా సాగింది.
1937 లో చైనా-జపాన్ మద్య రెండవసారి యుద్ధం మొదలైంది, అది రెండవ ప్రపంచయుద్దనికే దారి తీసింది. ప్రపంచదేశాలు రెండుగా విడిపోయి అతి ఘోరంగా యుద్ధం చేశాయి. ఎన్నో కోట్లమంది (ఎక్కువశాతం చనిపోయింది సామాన్య ప్రజానీకమే) మరణానికి కారణమయిన ఈ రెండవ ప్రపంచయుద్ధం ప్రపంచ చరిత్రలో అతిఘోరమైన పెద్దయుద్ధంగా పరిగణించబడింది. 1944 లో హీరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు ప్రయోగించి అమాయక ప్రజల హరించి పాతకాలకు ఒడగట్టింది ఈ యుద్దమే. అందుకే బ్రహ్మంగారు ఈ యుద్దాన్ని "పాతకంబగు యుద్దములు" అని చెప్పటం జరిగింది. అన్యంపుణ్యం ఎరుగని అమాయక ప్రజల, నోరులేని జీవాల ప్రాణాలెన్నో ఈ యుద్దంలో హరించాయి.
No comments:
Post a Comment