Happened Kalajnana Words - Greatness of Tirumala
ముడుపు వెంకటప్ప వుత్సాహమయ్యేని
ముడుపూలు తిరుమలకు నడచేనుమా (గోవింద వాక్యాలు)
వేంకటేశ్వరుని మహిమ హెచ్చిపొయ్యీని
ఈ దివ్యస్థళంబుల అద్భుతాలు పుట్టును (శ్రీ వీరప్పయ్యగారి కాలజ్ఞానము - ద్వాదశాశ్వాసము)
వివరణ:
తిరుమల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. బ్రహ్మంగారి కాలంలో తిరుమలకు ఇప్పుడున్నంత భక్తుల సందడి, ఆదాయం, ప్రపంచ ప్రఖ్యాతి లేదు. ఆ కాలంలో తిరుపతికంటే అభివృద్దిలోను, ప్రాచుర్యంలోనూ భారతదేశంలోని కొన్ని ఇతర దేవాలయాలు ఉండేవి, అప్పట్లో బ్రహ్మంగారు చెప్పటం అనేది విశేషమే. అదీకాక ముడుపుల వెంకటేశ్వరస్వామిగా బ్రహ్మంగారి తరువాతకాలంలోనే ఎక్కువ ప్రఖ్యాతిలోకి రావటం జరిగింది. ఇంత అభివృద్ధి అనేది అప్పట్లో ఊహించబడిందికాదు కూడా. దాదాపుగా బ్రిటీష్ ప్రభుత్వం పోయి భారత ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత తిరుమల ఎంతో అభివృద్దిలోకి రావడమే కాకుండా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చి దేశంలోనే కాక ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇంకా దినదినమూ ప్రఖ్యాతి పొందుచున్నది.
పై రెండుచోట్ల బ్రహ్మంగారు ఇంచుమించుగా ఒకే అర్థాన్ని ఇచ్చే విధంగానే చెప్పారు. మొదటి వాక్యాల్లో వెంకటేశ్వరుని ఆదాయం బాగా పెరుగుతుందని చెప్పబడింది. తరువాతి వాక్యాలలో వేంకటేశ్వరుని మహిమ పెరుగుతుందని (కోరిన కోర్కెలు నెరవేరటం - అవి బహుళ ప్రచారంలోకి రావటం), అలాగే తిరుమలలో ఎన్నో అద్భుతాలు జరుగుతవని (ఎక్కడా జరగని ఆశ్చర్యపడే సంఘటనలు) చెప్పటం జరిగింది. కోరుకున్నవారికి కోరుకున్న విధంగా ఎన్నో జరగరాని వింతలు వెంకటేశ్వరునిపైన విశ్వాసం ఉంచడంవలన జరుగుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. వెంకటేశ్వరస్వామిని కోరిన కోర్కెలు, తప్పక నేరవేరుతవి అనే విశ్వాసం భారతదేశవాసుల విషయంలోనే కాక ప్రపంచదేశ వాసులలోనూ గట్టిగా ఏర్పడింది.
No comments:
Post a Comment