Happened Kalajnana Words - Mahatma Gandhi Birth
ఉత్తరదేశమున వైశ్యకులమందు
ఉత్తమగంధొకడు బుట్టినిమా
హత్తుగనన్నియు దేశముల వారంత
సత్తుగ పూజలు జేసేరుమా
శివగోవింద గోవింద హరిగోవింద గోవింద.
వివరణ:
ఇవి మహాత్మాగాంధి గారి గురించి బ్రహ్మంగారు సుమారు 400 ఏళ్ల క్రితమే చెప్పిన కాలజ్ఞాన వాక్యాలు. బ్రహ్మంగారు చెప్పినట్టే మహాత్మా గాంధి గారు ఉత్తరభారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం పోరుబందర్ లో వైశ్యకులములో పుట్టటం జరిగింది. మహాత్మాగాంధి గారు కేవలం భారతదేశంలోనే కాక ప్రపంచంలోని ఎన్నో దేశ ప్రజలచే గౌరవించి పూజించ బడటం మనం చూస్తూనే ఉన్నాం. మహాత్మాగాంధీని బ్రహ్మంగారిక్కడ "ఉత్తరదేశమున వైశ్యకులమందు ఉత్తమగంధొకడు బుట్టినిమా" అని ప్రత్యేకించి చెప్పటం జరిగింది. ఉత్తరభారతదేశంలోనే ఎంతోమంది గాంధీలు వచ్చారు, వాళ్ళలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు, అందుకే వారేమో అని మనం పొరబడకుండా వైశ్యకులములో పుడతాడు అని స్పష్టంగా చెప్పటం జరిగింది.
లోకమంతయును యేకంబుగాజేసే
యేకుపట్టువాడు వచ్చీనిమా
ప్రాకటంబుగాను లోకంబులో తాను
మేకై నిలిచి జనుల మేలెంచునుమా
శివగోవింద గోవింద హరిగోవింద గోవింద.
వివరణ:
మొదటి వాక్యాల వెంటనే చెప్పబడిన ఈ వాక్యాలు కూడా మహాత్మాగాంధీ గారి గురించినవే. ఇక్కడ "లోకమంతయు" అంటే ప్రపంచాన్ని మొత్తం తన అహింసా సిద్ధాంతం, సత్యవాక్కులతో ఏకం చేసేవాడు అనే గాక, ప్రధానంగా స్వాతంత్ర్యం సిద్ధికై భిన్నత్రోవల్లో వెళుతున్నభారతదేశవాసుల నందరినీ ఏకం చేసేవాడుగా ప్రజల మేలుకోరకే తన జీవితాన్ని అంకితం చేసేవాడుగా బ్రహ్మంగారు చెప్పటం జరిగింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మాగాంధి గారి పాత్ర మరువలేనిది, వారు భారత ప్రజలకు చేసిన మేలు, సేవ కూడా అంతే గొప్పది. పై వాక్యాలలో "యేకుపట్టువాడు" అనగా నూలువడికేవాడు అని అర్థం. మహాత్మాగాంధి గారు తనకు తీరిక దొరికినప్పుడల్లా నూలు వడకటం రాట్నం తిప్పటం చేసేవాడు. గాంధిగారు స్వయంగా ఎన్నో బట్టలను తయారు చేయటం ధరించటమే కాక ఎంతో మందికి బహుమానంగా కూడా ఇవ్వటం జరిగింది. "మేకై నిలిచి" అంటే తన అహింసా సిద్దాంతాలతో, ఉద్యమాలతో బ్రిటీష్ పాలకులకు కంటికి కునుకులేకుండా పక్కలో బల్లెంలా, గుచ్చుకునే మేకులా తయారై, ఇంక మా వలన పరిపాలించటం కాదు అనే స్థితికి బ్రిటీష్ వారిని తీసుకువచ్చి భారత దేశానికి స్వాతంత్ర్యాన్నితీసుకురావటం జరిగింది. పై బ్రహ్మంగారి కాలజ్ఞాన వాక్యాలు అక్షరంకూడా తప్పకుండా సత్యమైనవి.
No comments:
Post a Comment