తెలుగుభాష ద్రవిడజాతి భాష, అతిపురాతనమైన భాష. ఎంత పురాతనమంటే నిజానికి తమిళ కన్నడముల కంటే కూడా పురాతనమైనదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నట్టి బాష. కాని తొలి నుండీ తెలుగు భాష వివక్షతకు గురికావడమే కాక చరిత్ర ఆనవాళ్ళను సహితం నిలుపుకోలేకుండా చేయబడిన భాష. అయినా వేల సంవత్సరాల నుండీ తన ఉనికిని నిలుపుకుంటూనే వస్తుంది. వేరే భాషల ద్వారా తెలుగు భాష ప్రభావితమైనంతగా మరొక భాష ప్రభావితం కాలేదు - అయినా నిలబడింది. ఒకటా రెండా బ్రాహ్మీ, దేవనాగరి, సంస్కృత, ప్రాకృత, ఆంద్ర, పార్శీ, ఉర్దూ భాషలెన్నో వచ్చి ఆధిపత్యం చేసినా వాటిని తనలో కలుపుకుంటూనే తన ఉనికిని చాటుకున్నది. ఆయా భాషా పదాల కలయికలో ప్రాచీన హోదాను కోల్పోయినా కూడా తన తీయదానాన్ని నిలుపుకుంది.
తెలుగు భాషను ఉద్యమంగా పూర్తి తెలుగు దేశీ పదాలతో ఆకాశానికెత్తిన సోమనాథుని రాకతో మళ్ళీ దేశీ తెలుగు, అచ్చ తెలుగు అంటూ తెలుగు భాష తన వైభవాన్ని కాకతీయుల కాలం వరకూ చాటుకున్నా తురుష్క రాజుల పాలనలో తిరిగి నిరాదరణకే గురయింది. సంస్కారం అంటూ అసలు తెలుగుభాష మాట్లాడితేనే ఏవగించుకునే స్థితికి తీసుకొచ్చారు నవీన మేధావులు. ఇప్పుడు సంస్కృతం లేదా ఆంగ్లం మొదలుగా గల ఇతర భాషల్లో మాట్లాడిన మాటలే సంస్కార భాషగా, అసలు తెలుగులో మాట్లాడితే సంస్కార హీన భాషగా మనిషి భావించే స్థితికి తీసుకొచ్చారు. విచారించ వలసిన విషయమేమంటే ఒక అచ్చ తెలుగువాడు వాడు తెలుగు మాట్లాడితే దాన్ని మేధావి అయిన తెలుగువాడే ఆ భాషను దూషించే స్థాయికి దిగజారటం. ఆంద్ర రాజులు పాలించినపుడు సంస్కృత, ప్రాకృత భాషలనే పోషించారు, రాజభాషగా స్వీకరించారు. అప్పటికే తెలుగుభాష జన బాహుళ్యంలో ప్రధానంగా వాడుకలో ఉన్నా నిరాదరణకే గురైంది. కాలంతో బాటు ఆంధ్రులు తెలుగువారితో కలిసిపోవటమే కాక సంస్కృత, ప్రాకృత, దేశీ పదాలను తెలుగుతో కలుపుకుంటూ కొత్త పదాలను సృష్టించారు (వైకృత పదాలు లేదా వికృతి లేదా వికారము నొందించబడిన పదాలు). ఇంతకుముందు దాదాపు ఇలాంటి విషయమై ఒక టపా రాసినా అంత విపులంగా రాయక సంతృప్తి నివ్వలేదు, అందుకే క్రింద ఈ విషయాలకు సంబందించి కొన్నిఉదాహరణలు ఇవ్వబడినవి గమనించగలరు. ఈ అచ్చ తెలుగు పదాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ వాడుకలో ఉన్నవే కాని సంస్కార వంతుడను అనుకునే సగటు తెలుగువాడే వాటిని తూలనాడుతుండటం, అవేవో పలుకరాని భాషగా పరిగణించటం, లేదా అవి తెలంగాణ మాండలికమని విమర్శించటం విచారించ వలసిన విషయం. అయినా అలాంటివారే నా తెలుగు, నా తెలుగుభాష గొప్పదనం అంటూ ఉపన్యస్తిస్తూ ఉండటం చిత్రాల్లోకెల్లా విచిత్రం.
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మాట్లాడే భాషలో చాలా మటుకు తెలుగు పదాలుంటాయి. ఆ పదాలకు సమానమైన సంస్కృత, ప్రాకృత, వికృత పదాలను అందరూ వాడుతూనే ఉంటారు. వారు వాడినప్పుడు తప్పుగా అనిపించని పదాలు తెలుగులో మాట్లాడితేనే తప్పు అనటం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ మద్యన ఒకసారి "సోయి" అనే తెలుగు పదం వాడాడు. దానికి పెద్ద దుమారం లేపారు. నిజానికి సోయి అంటే జాగరూకతతో లేకపోవటం, జరుగుతున్నది తెలియని స్థితిలో ఉండకపోవటం, మెలకువగా లేకపోవటం. దీనికే సమాన అర్థం ఇచ్చే సంస్కృత పదాలు "స్పృహ" లేదా "చలనము" ను చాలామంది నాయకులు నిత్యం ఉపయోగిస్తుంటారు. స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా? ఆ విషయంలో స్పృహ లేకపోవటం విచారకరం లాంటివి. క్రింద ఇవ్వబడిన పదాలు కూడా ఎక్కడైనా వినబడితే అదోరకంగా చులకనగా చూడటమో లేదా మాట సంస్కారం లేని వానిగా జమకట్టటమో జరుగుతుంది. దీనికంతటికీ ప్రధాన కారణం మన తెలుగు పదాలు మనకు దూరం కావడమే - పుస్తకాల్లో కాని, వాడుకలో కాని అవి కనిపించక పోవటమే. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పాఠ్యాంశాల్లో వీలైనంత ఎక్కువగా తెలుగు పదాలను ఉపయోగిస్తే భావి తరాల వారైనా తెలుగు భాషను అపార్థం చేసుకోకొండా ఉంటుంది. నేను పరభాషల వాడటం తప్పనటం లేదు - మనభాషను మనమన్నా గౌరవించుకోకపోతే భావితరాల వారు తెలుగు పదాలంటేనే ఏవో తిట్లుగా భ్రమసే ప్రమాదముంది.

గమనిక: ఇక్కడ ప్రధానంగా తెలుపబడుతున్నవి - తిట్లు, అనాగారికంగా భావిస్తున్న కొన్ని తెలుగు పదాలనే.
అనాగరికం అనుకుంటున్న అసలైన తెలుగు భాష (తెలంగాణా వాడుక) - సంస్కారం అనుకుంటున్న మనది కాని పరాయి పదాలతో కూడిన భాష
1) దుకాణం పోయాడు - కొట్టుకు వెళ్ళాడు
(ఇక్కడ దుకాణం అనేది దేశీయమైన తెలుగు. కొట్టు అనేది సంస్కృత, ప్రాకృతములతో కూడుకున్న వైకృత పదము)
2) కూడు తిను - భోజనం చేయు
(ఇక్కడ కూడు మరియు తిను అనేవి తెలుగు పదాలు. భోజనం అనేది సంస్కృతం అయితే చేయు అనేది వికృతము.
3) ఈరోజు అమాస మంచిరోజు కాదు - ఈ దినము అమావాస్య శుభదినము కాదు
(ఇక్కడ ఈరోజు మరియు అమాస అనునవి తెలుగు పదాలు. దినము, అమావాస్య, శుభదినము సంస్కృత భవములె)
4)ఎక్కడ ఆసర (అండ) దొరుకుతలేదు - ఎక్కడ ఆశ్రయం లభించటం లేదు
(ఇక్కడ ఆసర అండ అనేవి తెలుగు పదాలైతే - ఆశ్రయం సంస్కృత పదము)
5)ఆత్రమెందుకు - తొందరెందుకు/ఆత్రుత ఎందుకు
(ఆత్రం అనేది తెలుగు పదం, తొందర అనేది వికృతి పదం అలాగే ఆత్రుత అనేది సంస్కృత పదం)
6) నీళ్ళాడింది / కానుపు అయింది - ప్రసవము అయింది
(నీళ్ళాడు, కానుపు అనునవి తెలుగు పదాలు అయితే ప్రసవము అనునది సంస్కృతము)
7) ఆరతి తీసుకో - హారతి (నీరాజనం) తీసుకో
(ఆరతి తెలుగు పదం హారతి వైకృతము, నీరాజనం సంస్కృతము)
8) ఉత్తగ ఇస్తున్నవా - పుణ్యానికి (ఉచితంగా) ఇస్తున్నావా
(ఉత్తగ అనేది తెలుగు పదమైతే పుణ్యము, ఉచితము అనేవి సంస్కృత సమములు)
9) నాకెర్క లేదు - నాకు జ్ఞాపకం (జ్ఞప్తి) లేదు
(ఎర్క/ఎరుక అనేవి తెలుగు పదాలు - జ్ఞాపకం/జ్ఞప్తి అనేవి సంస్కృత భవములు)
(ఎరుక అంటే యాది అనే కాక తెలియదు అనే అర్థం కూడా వస్తుంది సందర్భాన్ని బట్టి )
10) కక్కుకుంటున్నాడు - వాంతి చేసుకుంటున్నాడు
(కక్కు అనేది తెలుగు పదం - వాంతి అనేది సంస్కృతం)
11) కాక పట్టింది - జ్వరం పట్టింది
(కాక తెలుగు పదం - జ్వరం సంస్కృత పదం)
12) కనికరం లేదు - దయ (కరుణ) లేదు
(కనికరం అనేది తెలుగు పదం - దయ/కరుణ అనేవి సంస్కృత పదాలు)
13) గీర గీశాడు - రేఖ గీశాడు
(గీర తెలుగు - రేఖ సంస్కృతం)
14) చేతగానప్పుడు ఒక దగ్గర కూలబడాలి - సాద్యము కానప్పుడు ఒక దగ్గర విశ్రాంతి తీసుకోవాలి
(కూలబడాలి అన్నది తెలుగుపదం - విశ్రాంతి అలాగే సాద్యము కూడా సంస్కృత పదాలు)
15) ఇంట్లకు పొయ్యారు - గృహప్రవేశం చేశారు
(ఇల్లు, పోవుట అనేవి తెలుగు పడాలు - గృహము, ప్రవేశము అనునవి సంస్కృత పదాలు)
16) గబ్బు గొడుతుంది - దుర్గంధం వస్తుంది
(గబ్బు తెలుగు పదం - దుర్గంధం సంస్కృతం)
17) వాడొక తిక్కలోడు - వాడొక ఉన్మాది
(తిక్కలోడు తెలుగు పదం - ఉన్మాది సంస్కృతం)
18) ఎవ్వరి తావుల వారు ఉండండి - ఎవ్వరి స్థానంలో వారు ఉండండి
(తావు తెలుగు పదం - స్థానం సంస్కృత పదం)
19) నిర్రనీలుగుతున్నడు - గర్వం బాగా వచ్చింది
(నిర్రనీలుగుట/విర్రవీగుట తెలుగు పడాలు - గర్వము అనేది సంస్కృత పదం)
20) తూటు పొడువు - రంద్రము చేయు
(తూటు తెలుగు పదం - రంద్రము సంస్కృత భవము)

అమాస అన్నది అమావాస్య యొక్క భ్రష్టరూపమే కాని అచ్చమైన తెలుగుపదం కాదేమో?
ReplyDeleteదుకాణం అన్నమాట అన్ని జిల్లాలలోనూ వాడుతారు కదా?
ఆతృత నుండే ఆతురత ఆతురము ఆత్రము అనేవి వచ్చాయేమో ఆలోచింఛాలి.
తూటు అనే పదమూ బహుశః అన్ని జిల్లాలలోనూ వాడతారనుకుంటాను.
అలాగే నీలుగు అనే క్రియాపదమూ అన్నిజిల్లాలలోనూ వాడుతారనుకుంటాను.
పెద్దలు ఒకటి గమనించాలి ఈ వ్యాసం తెలుగుకు సంబందించినదే కాని ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా రాయటం జరగలేదు. ఇక అన్ని పదాలనూ ఒకటికి రెండు సార్లు నిఘంటువులతో సరిచూసే రాయటం జరిగింది.
Deleteమన్నించాలి. " అనాగరికం అనుకుంటున్న అసలైన తెలుగు భాష (తెలంగాణా వాడుక) - సంస్కారం అనుకుంటున్న మనది కాని పరాయి పదాలతో కూడిన భాష" అని మీరే ఈ పట్టీ నెత్తిన వ్రాసారు కదా. కాబట్టి మీరీ తెలుగుపదాలన్నీ తెలంగాణా వాడుకలు మాత్రమే అనుకుంటున్నారని భావించి వ్యాఖ్యానించాను. అంతే కాక వ్యాసం గురించి విడిగా నా వ్యాఖ్య ఏదీ చేయలేదు, కేవలం పట్టికే నా స్పందన తెలిపాను. మీరు బహుశః తెలంగాణాలో వాడుక అన్నప్పుడు మిగతా జిల్లాల్లో వాడరన్న అభిప్రాయం చెప్పలేదే అనవచ్చును. అటువంటి పక్షంలో తెలుగునాట వాడుక అని అంటే బాగుండేది. ఐతే తెలుగునాట అనటానికి మీకు ఏదైనా కారణం ఉండి ఉండవచ్చునేమో. కాని ఇలా శీర్షిక కొంచెం తప్పుదారి పట్టించేదిగా ఉండటం దురదృష్టకరం. మరొక మాట. తెలుగును ఎవరూ దూషించి సంస్కృతాన్ని నెత్తినబెట్టుకుంటున్నారని అనుకోను. దేనిప్రతిపత్తి దానిదే. రెండు భాషలూ అందమైనవే. కాబట్టి రెండు భాషల్లోనూ అందమైన కవిత్వం చెప్పవచ్చును. రెండూ కలగలిపి మణిప్రవాళంగా కూడా అందంగా కవిత్వమూ చెప్పవచ్చును. వ్యవహారంలోనూ అంతే అందంగా వాడుకచేయవచ్చును. అన్నం అన్నది సంస్కృతపదం. మీ వాదం ప్రకారం దాన్ని బువ్వ అనటం బాగుంటుంది. తప్పకుండా ఒప్పుకుంటాను. కాని గమనించండి. ఈ రోజున ఇంటా బయటా అంతా రైస్ అంటూన్నారు. కారణం పండితులూ మిగతా చదువుకున్న వాళ్ళూ అంతా అంగ్లం వెంట బడ్డారూ అది బాగుండి అనా> కానేకాదు. విద్యావిధానంలో హెచ్చుగా ఆంగ్లబోధన ఉండటం, ఉద్యోగవ్యవహారాలు హెచ్చుగా అంగ్లంలో నడవటం దీనికి కారణం. అలాగే నిజాముల కాలంలో ఉర్దూ భాష అనుభవించిందీ వైభోగం తెలంగాణాలో - మరచిపోయారా? లేదు కదా, మీరే తురుష్క రాజుల పాలనలో తిరిగి నిరాదరణకే గురయింది అని చెప్పారిక్కడ. అందుచేత తెలుగుమాటల చలామణీ తక్కువ కావటానికి పండితుల సంస్కృతవ్యామోహం అనే వాదాన్ని ఎవరూ చర్వితచర్వణం చేసి ప్రయోజనం లేదు. కాలంలో తెలుగు నిలవాలనే మీ కోరికను నేనూ పంచుకుంటున్నాను. అందుకోసం తెలుగుకు పెద్దపీట వేయాలి విద్యలో అనీ ఒప్పుకుంటాను. అలా గని, దేశకాలపరిస్థితులను పట్టించుకోకుండా వ్యవహరించటమూ కుదరదనీ అంటున్నాను. ఎవరు కాదన్నా ఏ భాషనూ ఆభాషాప్రధానప్రాంతీయులంతా ఒకే రకంగానో ఒకే యాసతోనో వాడుకచేయరు. ఇప్పుడు మీరు ప్రాంతీయాభిమానాల్ని తెలుగుకు పెద్దపీట నెపంతో జనం మీద రుద్దాలని అంటే అది సరైనపని కాదని అంటాను. అన్ని మాండలికవ్యవహారాలను గౌరవిస్తూనే, ఒక ప్రామాణికమైన తెలుగు ఒరవడిని ఏర్పరచుకోవలసిన అవసరం ఉంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మా ఊళ్ళ మాండలికమే అసలు తెలుగు అంటూ దురభిమానాలకు పోతే దానికి జనామోదం లబించదు. తదనంతర పరిణామాలూ బాగుండవు కూడా. సంకుచితంకావటానికి బదులు మన ఆలోచనధోరణులు విశాలం కావాలనే నా అకాంక్ష. అంతకంటే మరేమీ లేదు. నచ్చకపోతే నామాటలు వదిలెయ్యండి. ఇదొక పెద్ద చర్చచేసి ఉపయోగం ఉంటుందనుకోను వర్తమానకాల పరిస్థుతుల్లో. నా అభిప్రాయం నేను చెప్పాను. ఇందులో మిమ్మల్ని నొప్పించాలని చెప్పినది ఏదీ లేదు.
Deleteఅసలు టపా ముఖ్యోద్దేశ్యమే మీరు వదిలేసినప్పుడు ఇంకా చెప్పాల్సిందేముంది. టపా ముఖ్యోద్దేశ్యమే టపా శీర్షిక - "తెలుగు భాషలో మాట్లాడితే తిట్లుగా అర్థం చేసుకునే పరిస్థితికి తెలుగుభాషను మేధావులు సంస్కరించి వదిలేశారు" అని. ఈ సంస్కరణలు మధ్యకాలంలో ఏర్పడి ముద్రణరంగం వచ్చిన తరువాత వచ్చినవే కాని అంతకుముందు లేవు. ఇక వేరే భాషలు మాట్లాడవద్దని నేను చెప్పటం లేదని టపాలోనే రాశాను, ఏ భాషైన వాడండి కాని మన అసలు తెలుగు పదాలను అవేవో అనాగరిక పదాలుగా గుర్తించ వద్దనే చెప్పిందిక్కడ. ఇక నేను క్రింద ఇచ్చినవి తెలుగు- సంస్కృత/సంస్కృత భవాలైన తెలుగు కాని పదాలనే ఉదాహరణగా చూపడం జరిగింది. వాడుకలో ఉన్న ఈ సంస్కృత పదాలు తెలుగు పదాలే అన్నట్లున్నది మీ విమర్శ. ఇక ఇక్కడిచ్చిన తెలుగు పదాలు తెలుగు పదాలు కావు తెలంగాణ మాండలికాలే అనేదిగా ఉన్నది మీ విమర్శ. నేను తెలుగు అని చెప్పినవన్నీ మీకు యాస అని అనిపించటం చాలా విచిత్రంగానే ఉంది. ఇక తెలుగు మనం మాట్లాడితే సరిపోదు, అది జరగాలంటే ఒక్క ప్రభుత్వం చేతిలోనే ఉండేది. ప్రభుత్వం చదువులో ప్రవేశ పెడితే, రాజభాషగా ప్రోత్సాహం ఇస్తే దానంతట అదే వెలుగులోకి వస్తుంది. ఆంగ్ల భాష వ్యామోహం ఉన్నా విదేశాల్లో ఆయా దేశాల్లో వారి వారి భాషలే వాడుకలో ఉండడానికి కారణం - వారు వారి స్వభాషకు ఇచ్చే గౌరవమే. మీరన్నట్టు చర్చవల్ల ఒనగూడే ఉపయోగమేమీ లేదు.
Deleteఅమవస లేదా అమాస అనునది అమావాస్య కి భ్రష్ట రూపం కాకపోవచ్చు
Deleteఉదా: స్వతంత్రం - స్వాతంత్ర్యం
ఆతృత - ఆత్రం
ఎందు నుండి ఏది వచ్చిందో ఆలోచన కు అందదు
తూటు - కున్నాము, బొక్క…
భాష తప్పేం లేదండి. మాండలికాలు చాలా తియ్యగా ఉంటాయి. రాజకీయనాయకులు భాషను భ్రష్టు పట్టిస్తున్నారంతే.
ReplyDeleteకూరిమిగలదినములలో
నేరములెన్నడును గలుగనేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ.
సత్యమే చెప్పారు, ధన్యవాదములు.
Deleteనిజంగా భాషాజ్ఞానం,సహృదయమూ ఉన్నవారు 'తెలుగు ఐతే తిట్టు,సంస్కృతమైతే గొప్ప అనుకోరు.కాని చాలామందికి ఆ జ్ఞానం ఉండదు.మేం మాట్లాడేదే ఒప్పు అనుకుంటారు.మా ఉత్తరాంధ్రలో కూడా పల్లె ప్రజలు,చదువురాని వాళ్ళు అచ్చతెలుగుమాటలు వాడితే ఇక్కడి విద్యావంతులే వాళ్ళభాషని తప్పుబడతారు.రాయలసీమలో కూడా అందరికీ తెలియని అచ్చ తెనుగు మాటలు ఎన్నో వాడకంలో ఉన్నాయి.అజ్ఞానంవల్ల,అహంకారం వల్ల దీనిని చాలామంది గ్రహించలేరు.
ReplyDeleteమీరన్నట్టు అచ్చ తెలుగు వాడుక రాయలసీమలో ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు ఏమాత్రమైనా అచ్చ తెలుగు వాడబడుతుంది అంటే అది చదువుకోని వారి గొప్పతనమే. తెలుగుభాష మాట్లాడకపోయినా, తెలుగు మాట్లాడితే అనాగరికంగా భావించకూడవద్దనే ఈ టపా ముఖ్యోద్దేశ్యం, అది మీరు గ్రహించినందులకు ధన్యవాదాలు.
Delete