Tuesday, 7 October 2014

అరుదైన తెలంగాణ కవుల అపూర్వ వ్రాతప్రతులు

తగిన ఆదరణలేక తెలంగాణ సాహిత్యము ఎన్నో ఏళ్ల నుండి చీకటిలో మ్రగ్గిన మాట అక్షర సత్యము. తాళపత్రాలు, రాత ప్రతుల కాలం నుండి తెలంగాణ రచనలు ముద్రణ రంగంలోకి రాకపోయాయి. దీనికి ప్రధాన కారణం నిజాం కాలంలో ఉన్నపుడు తెలుగుభాష గుర్తింపుకు నోచుకోక వెలుగులోకి రాకపోవటం. అప్పట్లో ఒక గ్రంధం ముద్రించాబడాలంటే నిజాంరాజు అనుమతి పొందాలి, ఘనత వహించిన నిజామును శ్రీ.మ.ఘ.చక్రవర్తి అని, ప్రభువు అని పొగడుతూ ఆ పుస్తకం వారికి అంకితం ఇవ్వబడాలి. ఇంక అప్పట్లో ప్రపంచయుద్దాలతో కాగితం కరువు ఒకటైతే, దానిని కొనటం ప్రింట్ చేయటం కూడా ఎంతో ఖర్చుతో కూడుకొన్న పని. అందుకే ఆ కాలంలో తెలంగాణలో ఎక్కువ పుస్తకాలు కాని పత్రికలు కాని వేలువడలేక పోయాయి. 

ఇక ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డా తెలంగాణా రచనలు కాని రచయితలు కాని వివక్షకే గురికావటం జరిగింది. కనీసం వాటి గురించి కాని, వారి గురించి కాని లేదా తెలంగాణలోని చరిత్రకు సంబందించిన విశేషాలు కాని ఏవీ పాఠ్య పుస్తకాల్లో కాని అధికారిక ప్రచురణలో కాని వెలుగులోకి తేవడం జరగలేదు. పైగా సోమన, పోతన, భీమన లాంటి మహాకవులు తెలంగాణకు సంబందించిన వారు కాదంటూ పుంఖాను పుంఖనుగా వ్యాసాలు  రాసిన మహానుభావులు ఎందఱో ఉన్నారు. అసలు దేశీ ఛందస్సులో తొలి తెలుగు కావ్యాలు రాసిన సొమనాథునే ప్రక్కన బెట్టారు. 

మరుగునపడిపోయిన తెలంగాణ కవులను, తెలంగాణా సాహిత్యాన్ని   వెలుగులోకి తీసుకొచ్చే భాద్యత కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంపైన ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్ర మాసపత్రికను తేవడం అభినందించదగ్గ విషయం, దానిని అందరికీ అందుబాటులోకి తేవడం ఎంతైనా అవసరం. అంతేగాక నిజాం కాలంలో భద్రపరచబడిన తెలుగు సాహిత్యాన్ని, చరిత్రను వెలుగులోకి తేవడం కూడా ఎంతైనా అవసరం. 

ఈ క్రింద నిజాం కాలంలో ఉస్మానియా యూనివర్శిటీలో భద్రపరచబడిన అమూల్యమైన నేటికీ వెలుగులోకి రాని కొన్ని రాతప్రతుల వివరాలు హైదరాబాదు సమాచారం పత్రిక నుండి యథాతథంగా ఇక్కడ ఇవ్వబడినవి, ఇందులో అధికంగా తెలంగాణ కవులచే రాయబడినవి ఉన్నవని చెప్పడం గమనించదగ్గ విషయం. అంతేగాక ఇందులో పేర్కొనబడిన కొన్ని గ్రంధాలు ఇంతవరకూ ప్రచురణకు నోచుకోనివి, వెలుగులోకి రానివి ఉండటం విశేషం. 

4 comments:

 1. చాలా బాగా రిసెర్చ్ చేస్తున్నారు. మీ ఆర్టికల్స్ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. మీ కాంటాక్ట్ నం ఇవ్వగలరా?

  ReplyDelete
 2. Dear Mallikarjun
  I am a senior citizen from Telangana and having more than ordinary interest in reading of philosophy , history and science. I am, therefore, reproducing the first para of an article titled Pachamama in the Wikipedia (I certainly hope you might have already come across this bit of article). I have also come across lot of authentic articles on Inca’s, Maya and Aztec civilizations, which are slowly pointing out to the strong relations to India or especially South India.
  “Pachamama is a goddess revered by the indigenous people of the Andes. She is also known as the earth/time mother. In Inca mythology, Pachamama is a fertility goddess who presides over planting and harvesting. She causes earthquakes and is typically in the form of a dragon. She is also an ever present and independent deity who has her own self-sufficient and creative power to sustain life on this earth. Pachamama is the wife of Pacha Kamaq and her children are Inti, the sun god, and Killa, the moon goddess. In Quechua cosmology, these are the four organizing principles of nature based on water, earth, sun, and moon. Llamas as well as burned, elaborate miniature garments are sacrificed to her. After the conquest by Spain, which forced conversion to Roman Catholicism, the figure of the Virgin Mary became united with that of the Pachamama for many of the indigenous people. In pre-Hispanic literature, Pachamama is seen as a cruel goddess eager to collect her sacrifices. As Peru began to form into a nation, however, Pachamama began to be–and to this day is–perceived as being benevolent and giving. She is also seen as nature itself. Thus, problems arise when people take too much from nature because they are taking too much from Pachamama.”
  I have to congratulate your sincere efforts in highlighting the forgotten history of Telangana Region. As I and my great great grand fathers are Telanganites , I should recollect the Godess POCHAMMA in view of the above subject matter. After reading your blogs, I am appealing to do some sincere in depth analysis and study in this regard which will be helpful to achieve Bangaru Samajika Telangana by our State Government. Jai Telangana. Jai Hind.

  Venugopal Rao T
  9th October 2014.

  ReplyDelete
  Replies
  1. మీ కృషి ఎంతో విలువైనది, అభినందనీయం. మీరు ఊహించింది నిజమే. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రుల రాక పూర్వము , నాగజాతి వారు వచ్చారని, వారికి పూర్వము ఇక్కడ నివసించిన జాతులు అతి ప్రాచీన జాతులని తెలుస్తుంది. ఈ ప్రాచీన జాతులలో ఫరహాబాదు చెంచులు ఒక జాతి వారు, మీరు చెప్పిన "పంచమమ" ఆరాధకుల్లో వీరు ఒకరు అని చెప్పవచ్చు. ప్రాచీన చెంచులు పంచభూతాలను ఆరాధించినట్టు తెలుస్తుంది. వీరి ప్రధాన ఆరాధ్య దేవత కూడా అమ్మవారే కావడం విశేషం. ఈ కొండదేవత ఆనవాళ్ళు కొండల ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా కనిపిస్తాయి. తరువాత ఈ అమ్మవారి ఆరాధననే జైనులు కొనసాగించటం జరిగింది. ఇప్పటికీ పోచమ్మ లాంటి వివిధ రూపాల్లో మనం పూజిస్తూనే ఉన్నాం. అంతేగాక నేటి ఈ గ్రామదేవతల ఆరాధన నాగరికత కాలానికి భిన్నంగానే ఉంటుంది. పోచమ్మ దేవత ఆరాధన అతిపురాతనమైనదే. పంచమమ మాదిరినె పొచమ్మను కూడా వానాకాలం ఆరంభంలో భోనాలు పేరుతో పూజించటం ఇప్పటికీ కొనసాగుతుంది. అలా ఆరాధించకపోతే పోచమ్మ ప్రకృతి ద్వారా విపత్తులు కల్పిస్తుందనే విశ్వాసం నేటికీ బలంగా ఉంది.

   ప్రాచీన చెంచుల గూర్చి ఒక టపాలో కొంతభాగం రాశాను. ఈ జాతి వారు ఆస్ట్రేలియా ఖండంలోని ఆస్ట్రలాయిడు జాతి వారిని పోలి ఉందురు. వీరికి ఆస్ట్రేలియా, సిలోను, ఇండోనేషియ, మలేషియా జాతులతో సంబందాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. వీరందరి పోలికలు, రంగు, వెంట్రుకలు, శరీర ఆకృతి లాంటివి ఒకటిగా ఉండటం విశేషం. కాగా ఇక్కడి చెంచు జాతి వారే ప్రాచీనకాలంలో వివిధ దేశాలకు వలస వెళ్ళినట్లుగా కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటిదే బర్మాలోని తైలింగులు కూడా, వీరు తమ స్వస్థలం తెలంగాణ ప్రాంతంగానే చెప్పుకుంటారు. వారి గురించి అధ్యయనం చేసినప్పుడు వీరి భాష కాని, అలవాట్లు, ఆచారాలు కాని తెలంగాణా ప్రాంతం వారితో పోలికలు కనిపిస్తాయి, క్రీ.పూ. వీరు ఇక్కడి నుండి వెళ్ళినట్లు తెలుస్తుంది. ప్రధానంగా అధికారంలో లేకపోవడమనే కారణం చేతనే తెలంగాణ ప్రాచీన చరిత్ర అన్నది వెలుగులోకి రాలేకపోయింది. నిజాంకాలంలో మొదలైన తవ్వకాలు కూడా ఇప్పటికీ అదేస్థితిలో ఉన్నవి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఈ పరంగా ప్రత్యేక శ్రద్ధ చూపితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో బయటకు వచ్చే అవకాశాలున్నాయి. సమీప కాలంలో ఇది జరిగితీరుతుందనే నేను విశ్వసిస్తున్నాను.

   Delete
 3. మిత్రమా...నమస్సులు! మీ కాంక్ష అభినందనీయం. అభిలషణీయం. ఆచరణీయం. దీనికి ప్రభుత్వం, సాహితీవేత్తలు తప్పకుండా పూనుకోవాలి. అప్పుడే తెలంగాణ... సాహితీ క్షేత్రమే ననే అంశం లోకానికి తెలుస్తుంది. తెలంగాణలో కవులే లేరు అనే అప్రాచ్యుల నోటికి తాళం పడుతుంది.

  -గుండు మధుసూదన్

  ReplyDelete