Monday, 6 October 2014

బహుపురాతనం హైదరాబాదు క్రికెట్

Hyderabad Cricket History


హైదరాబాదు క్రికెట్ చరిత్ర తెలంగాణకే గాక భారతదేశానికే గర్వకారనమనదగినది. 
హైదరాబాదులో క్రికెట్ ఆడటం సుమారు 1850 ప్రాంతం నుండీ ఉందని తెలుస్తుంది.
1900 ప్రాంతం నాటికే హైదరాబాదులో క్రికెట్ టోర్నమెంట్ ఆడటం మొదలయ్యింది.
నాటి నిజాం ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్ గారు ఈ క్రికెట్ కు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు.
హైదరాబాదులో మొదటి టోర్నమెంట్ "మహారాజా కిషన్ ప్రసాద్ టోర్నమెంట్".
ప్రతి సంవత్సరం జరిగే ఈ టోర్నమెంట్ లో భారతీయులకు యురోపీయన్లకు పోటీ జరిగేది.
ఈ పోటీల్లో భారతీయులే ప్రతి సంవత్సరం గెలిచేవారు. ఈ టోర్నమెంట్ 1920 వరకు నడచింది.
1922 నుండీ "క్వాడ్రాన్గ్వులర్" టోర్నమెంట్ గా మార్పుచెంది అన్ని దేశాలవారితోను ఆడబడినది.
ఈ టోర్నమెంట్ 1930 వరకు నడచింది.
ఈ క్రికెట్ పందెములు అసాంఘికము అనే ఉద్దేశ్యముతో 1930 నాటికి నిలుపుచేయబడింది. 


ఈ హైదరాబాదు క్రికెట్ కు సంబందించిన పాతకాలం నాటి మిగతా విశేషాలను నాటి నిజాం ప్రభుత్వపు హైదరాబాదు సమాచారం మాస పత్రిక నుండి యథాతథంగా ఇక్కడ ఉంచుతున్నాను.







No comments:

Post a Comment