మా ఇంట్లో వందల ఏళ్ల నాటి గ్రంధాలు చాలా ఉన్నవి. చదివే తీరికలేక అంతగా అవరంలేనివి సంచుల్లో వేసి పైన పడేశాను. చెదలు పట్టి, ఎలకలు కొట్టి, జిల్లపురుగులు(బొద్దింకలు) పాడు చేసి వందల పుస్తకాలు నాశనమయ్యాయి. సమయం దొరికినప్పుడు అటకమీద నుండి తీసి దులిపి పెడుతుంటాను. మొన్న పుస్తకాలు దులిపేటప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞాన వాక్యాల పుస్తకం కన్పించింది. వర్తమాన విషయాలు (రీసెంట్ ఇన్సిడెంట్స్) పైన ఎమన్నా కన్పిస్తాయేమో అనే ఉత్సాహం నా మదిలో తొలిచి చదవటం ప్రారంభించాను. ఈ మద్య జరిగిన సంఘటనల గురించి బ్రహ్మంగారు ముందే చెప్పిన విషయాలు కొన్ని నాకు గోచరించాయి. వాటిని నా బ్లాగులో పెడుతున్నాను, చదువరులు విశ్లేషించగలరు. బ్రహ్మంగారు మహాపురుషులు, జ్ఞాని. ముందు జరగబోయే విషయాలను వందల ఏళ్ల పూర్వమే రాసిపెట్టిన కాలజ్ఞాన పురుషుడు. ఆయన చెప్పినవెన్నో జరిగాయి, ఇకముందు కూడా జరగనున్నాయి.
ఉత్తరభారత వరదల గురించి బ్రహ్మంగారు చెప్పిన వాక్యాలు
ఉత్తరదేశమున సత్తుగ ప్రజలంత
కత్తూలతో వేటలాడేరుమా
ఉత్తమాటలుగావు నదీనదములు పొంగి
వూళ్ళన్ని కొట్టుకుపోయేనిమా
శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద.
వివరణ:
ఇందులో ప్రదానంగా ఒక ప్రాంతం అని కాక ఉత్తరభారతాన్నే ప్రస్తావించాడు బ్రహ్మంగారు. ఉత్తరభారతంలో చాలా చోట్ల అల్లర్లు జరగటం, నదులు పొంగి ఊళ్లు కొట్టుకు పోవటం మనం గమనిస్తున్నాం.
ఉత్తరదేశం అంటే ఉత్తరభారతదేశం. అక్కడ కత్తులతో వేటలాడటం అంటే ఘర్షణలు చెలరేగటం. ఉత్తరభారతదేశంలో ఈ మద్యన చాలా అల్లర్లు జరగటం మనం గమనిస్తూనే ఉన్నాం. కాశ్మీర్ లో ఈమద్యన జరిగిన అల్లర్లకు కొన్ని రోజులపాటు మొత్తం కర్ఫ్యూ విదించటం జరిగింది. అదేకాక కాశ్మీర్ లో భారత సైనికుల తలలను కోసి పాకిస్తాన్ వారు తీసుకుపోవటం వంటివి జరిగాయి. అక్కడ సెప్టెంబర్ 2014 లో ఝీలం, చేనాబ్ నదులు పొంగి వచ్చిన వరదలతో కాశ్మీర్ లోని ఊళ్లన్ని కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలారు జనం. చాలామంది చనిపోయారు కూడా. గతంలో ఎప్పుడూ రానంతగా వచ్చి నష్టం తెచ్చాయి ఈ వరదలు.
గత కొంతకాలం నుండీ ఉత్తరభారతదేశంలోని పలు ప్రాంతాలలో ఘర్షణలు చెలరేగటం కత్తులు దూసుకోవటం జరుగుతూనే ఉన్నాయి. గుజరాత్ అల్లర్లు, ముజఫర్ నగర్ అల్లర్లు, పంజాబ్ అల్లర్ల సంఘటనలలో కూడా కత్తులు దూయటం కనిపిస్తుంది. అలాగే బెంగాల్ లో చాలా అల్లర్లు రీసేంట్ గా జరిగి ఎంతో మంది చనిపోయారు.
ఉత్తరభారతంలో చాలా నదులు గత ఏడాది నుండీ పొంగి పొర్లుతూ ఎన్నో ఊళ్ళని తుడిచిపెట్టడం మనము చూస్తున్నాం. జూన్ 2013 లో వచ్చిన ఉత్తరభారత వరదలలో (ఉత్తరాఖండ్ వరదలు) గంగోత్రి, యమునోత్రి, అలకనంద నదులు పొంగి హిమాచలప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా లోని ఎన్నో ఊళ్ళని తుడిచి పెట్టేసింది. అలాగే ఉత్తరప్రదేశ్ లో ఆగష్టు 16, 2014 న రప్తి మరియు ఘఘర నదులు పొంగి వచ్చిన వరదలలో ఎన్నో గ్రామాలు జల దిగ్బందమై వేల ఇళ్ళను తుడిచి పెట్టేసింది. అలాగే ఆగష్టు 16, 2014 నాడే బిహార్ లోని ఘగ్ర, బుధి గంధక్, కమల, బుతహి బాలన్, మహానద, కోసి, గండక్, కమ్లా బాలన్, బాగ్ మతి నదులు పొంగి సుమారు వంద ఊళ్ళను ముంచేసింది. అలాగే ఈ మద్యన ఉత్తరభారతదేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బెంగాల్ లో చాలా నదులు పొంగి వరదలు భీకరంగానే వచ్చాయి.
మీ దగ్గర పురాతనగ్రంథాలుంటే వాటిని ప్రభుత్వానికి అందిస్తే వారు భద్రపరుస్తారు కదా? పురుగులపాలు చేయవద్దు దయచేసి.
ReplyDeleteపాతకాలంవి చదివే ఓపిక గాని, ఆ భాష అర్థం చేసుకునే వారుగాని ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి . అయినా కొన్ని గ్రంథాలు ఒక ఆశ్రమం వారికి ఇచ్చాను. మిగతావి కూడా నా అవసాన దశలో ఏదో ఒకశ్రమానికి ఇచ్చివేస్తాను.
Deleteఉన్నాముగ మా బోంట్లము
Deleteప్రభుత్వ గ్రంధాలయాల్లో / మ్యూజియాల్లో భద్రపరచడానికి శాస్త్రీయ పద్ధతులు / టెక్నాలజీ ఉంటాయి. అందువల్ల ప్రభుత్వానికి అందజేస్తేనే మంచిది.
ReplyDeleteప్రస్తుతం నా దగ్గర ఉన్నవి అంత ప్రాచీనం, అమూల్యమైనవి ఏమీ లేవు. చాలా మటుకు గ్రంధాలయాల్లో దొరికేవే.
ReplyDeleteపాడయినా పర్వా లేదు ప్రభుత్వానికి ఇవ్వకండి సెక్యులర్ బానిసలు వాటిని దుర్వినియోగం చేస్తారు...
ReplyDelete