Telangana Talli Song
జయజయహే తెలంగాణ... జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
పదిజిల్లల నీపిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండరగండడు కొమరం భీముడే నీబిడ్డ
కాకతీయ కళాప్రభాల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
జానపద జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళల మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాల జనజాతర
అనునిత్యం నీ గానం... అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పువ్వులపొద
సిరులు పండె సారమున్న మాగాణియె కద నీ యెద
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలే
పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలె
సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలే
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
జయజయహే తెలంగాణ... జననీ జయకేతనం
ReplyDeleteఅనునిత్యం నీ గానం... అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె....జై తెలంగాణ! జై జై తెలంగాణ!!..సత్యసాయి విస్సా ఫౌండేషన్.