సుప్రసిద్ద వాక్యాలు - పూర్తి శ్లోకార్థాలు - 3
విద్వాన్ సర్వత్ర పూజ్యతే
శ్లోకం:
స్వగృహే పూజ్యతే మూర్ఖస్స్వగ్రామే పూజ్యతే ప్రభు: !
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే !!
తాత్పర్యం:
మూర్ఖుడు తన ఇంటిలోన గౌరవించబడతాడు, గ్రామాధికారి తన గ్రామంలోనే గౌరవించబడతాడు, రాజు తన దేశంలోనే గౌరవించబడతాడు, కాని విద్వాంసుడు మాత్రం ఏప్రాంతంలోనైనా, ఎక్కడైనా గౌరవించబడతాడు.
మాంసం మాంసేన వర్ధతే
శ్లోకం:
ఘ్రుతేన వర్ధతే బుద్ది:, క్షీరేణాయుష్య వర్ధనం !
శాకే నవర్ధతే వ్యాధిర్మాంసం మాంసేన వర్ధతే !!
తాత్పర్యం:
నేతిని వాడటం వలన బుద్ది పెరుగుతుంది, పాలు త్రాగడం వలన ఆయువు పెరుగుతుంది, కూరగాయలు తినడం వలన వ్యాధులు దరికి రావు, మాంసం తినడం వలన మాంసమే పెరుగుతుంది (మాంసం అనగా క్రొవ్వు).
సుపుత్రః కులదీపకః
శ్లోకం:
శర్వరీ దీపకశ్చంద్ర: , ప్రభాతో ద్దీపకో రవి: !
త్రైలోక్యదీపకో ధర్మస్సుపుత్రః కులదీపకః !!
తాత్పర్యం:
చంద్రుడు రాత్రిని ప్రకాశింప జేయును, సూర్యుడు పగటిని ప్రకాశింప జేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింప జేయును, సుపుత్రుడు కులమును ప్రకాశింప జేయును.
అస్థిరం యౌవనం ధనం
శ్లోకమ్:
అస్థిరం జీవనంలోకే, అస్థిరం యౌవనం ధనం !
అస్థిరం దారపుత్రాది, ధర్మకీర్తీ ద్వయంస్థిరం !!
తాత్పర్యం:
జీవించటం శాశ్వతం కాదు, యవ్వనం, ధనం శాశ్వతం కావు, భార్యాబిడ్డలు శాశ్వతం కారు, కేవలం మనం పొందిన ధర్మం, కీర్తి అనేవే శాశ్వతం.
అతివినయం ధూర్త లక్షణం
శ్లోకం:
ముఖం పద్మ దళాకారం, వచశ్చందన శీతలం !
హృత్కర్తరీ సమంచాతివినయం ధూర్త లక్షణం !!
తాత్పర్యం:
తామరరేకులవంటి ముఖవర్చస్సు, శ్రీగంధమువలె చల్లనిమాటలు, కత్తెరలాంటి మనస్సును, అతివినయమును ధూర్తుని యొక్క లక్షణములు.
వివరణ:
ముఖ్యంగా చెప్పబడేదేమంటే అతిగా ప్రవర్తించేతీరు నమ్మదగింది కాదని. సహజంగా కాకుండా తామర రేకులవంటి రంగు ముఖంతో అంటే ఏదో రంగు పులుముకుని మోసం చేస్తున్నాడని అర్థం. అలాగే చల్లనిమాటలు సహజంగా అందరూ మాట్లాడతారు కాని సుగంధం పూసినట్టుండే చల్లచల్లటి మాటలు మోసపూరితపు మాటలే. ఉన్నదిఉన్నట్లు మాట్లాడం వేరు కాని మరీ కత్తెరలా సరిగ్గా కట్ చేసి అతికించి మాట్లాడే మాటలు మోసపూరితమే. అలాగే అతిగా వినయము ప్రదర్శించుట మోసమే. దుర్మార్గులు, దుష్టులు, మోసం చేసేవారు ఇలాంటి లక్షణాలు ప్రదర్శిస్తారని, అతిగా ప్రవర్తించే వారి పట్ల జాగారుకతతో ఉండాలని ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది.

ముత్యాలలాటి శ్లోకాలిచ్చారు, ఆనందః
ReplyDeleteమీశ్లోకం ఒకటి నా టపాలో వాడుకున్నానండీ ఈ రోజు.
ReplyDeleteమీశ్లోకం ఒకటి నా టపాలో వాడుకున్నానండీ ఈ రోజు.
ReplyDeleteనలుగురికీ ఉపయోగపడే మంచి విషయాలు ప్రచారం చేయడం మంచిపని, ధన్యవాదాలు.
Delete