మా తాత కన్న కల నేడు నిజమైంది
కేంద్రం తెలంగాణాకు ఆమోదం తెలిపి, కేంద్ర మంత్రులు ముద్ర వేసిన డిసెంబర్ 2013 నాటికే తెలంగాణా ఆవిష్కృతమైంది.
అయినా మొత్తం భారత దేశపు నేతల ఆమోద ముద్రకై వేచి, నేడు పార్లమెంటులో
మూడింట రెండువంతుల మెజారిటీతో ఆమోదం పొంది
తెలంగాణా రాష్ట్రం 29 వ నూతన రాష్ట్రంగా వెలసింది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని 60 ఏళ్లకు ముందు ఏనాడో మా తాత కన్న కల ఇది.
ఆ కలను కాలరాచాడానికి ఈ 6 దశాబ్దాల కాలంలో కౌరవుల్లాంటి ఎంతో మంది పుట్టుకొచ్చి కాలొడ్డి అడ్డం పడ్డారు.
తెలంగాణా ప్రజల నానా అవస్థల పాలు జేసి బందించి వారిపై సవారీ చేసి వికట్టాట్టహాసం చేశారు.
అయినా ఈ 60 ఏళ్లలో ఎందరో తెలంగాణా వీరులు అలుపెరుగని పోరాటం చేశారు - ఎందఱో అమరులూ అయ్యారు.
ఎంతమంది ప్రాణాలు ఫణంగా పెట్టారో అంతగా తెలంగాణాకై పట్టు పెరుగుతూ పోయింది.
అందుకే ఈ తెలంగాణా సాధనలో అమరులైన తెలంగాణా వీరులకే ఈ రాష్ట్ర సాధనలో అగ్రభాగం దక్కేది
వారికి వేవేల జోహార్లు
తెలంగాణా రాష్ట్ర సాధన పట్టును చేతబట్టి , అందరినీ ఒక చెంతకు చేర్చి, ప్రాణాలు ఫణంగా పెట్టి
ముందు నిలిచి అపర చాణక్యునిలా ఎత్తులకు పై ఎత్తులు వేసి చివరికి అందరినీ చిత్తు చేసిన KCR గారికి
జేజేలు
అహింసా వాదంతోనే భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మునిలా
మొక్కవోని ధైర్యంతో ముందునిలిచిన మరో మహాత్ముడు కోదండరాం గారికి
శతకోటి వందనాలు
తెలంగాణా రాష్ట్రం సాకారం అవటానికి సహకరించిన సోనియాజీ, సుష్మాజీ అదిగాగల నేతలకు
మనఃపూర్వక ధన్యవాదాలు
నేడు భారతీయుడనని ఎంత గర్వంగా చెప్పుకుంటావో
ఇంక అంతే సగర్వంగా తల ఎత్తుక మనుగడ సాగించు నేను తెలంగాణా వాడినంటూ
జై తెలంగాణా
జై జై తెలంగాణా
jai telangana
ReplyDeleteJai Telangana!!!!
ReplyDeleteశుభాకాంక్షలు మల్లికార్జున స్వామి గారు. జై తెలంగాణా.
ReplyDelete