చరిత్రకు కూడా అందని భారత దేశంలోని ప్రాచీన జాతులలో తెలంగాణాలో నివసించిన జాతులు కూడా కలవు
ప్రాచీన కాలం నుండి తెలంగాణాలో ఎన్నో జాతుల వారు నివాసం ఉన్నారని పురాణాలు, చరిత్ర వల్ల తెలుస్తుంది
అందులో కొన్ని జాతులు నశించి పోగా, కొన్ని జాతుల వారు మరికొన్ని జాతులతో కలిసిపోయి కనుమరుగయ్యాయి (రూపాంతరం చెంద బడ్డాయి)
మరికొన్ని నేటికీ మనుగడ కొనసాగిస్తూ తెలంగాణాతో బాటు మరికొన్ని ప్రాంతాల వ్యాపించి జీవనం సాగిస్తున్నాయి
మరికొన్ని నేటికీ మనుగడ కొనసాగిస్తూ తెలంగాణాతో బాటు మరికొన్ని ప్రాంతాల వ్యాపించి జీవనం సాగిస్తున్నాయి
ప్రాచీన జాతులలో సంఖ్యాబలం, దేహబలం, బుద్దిబలం బట్టి ఆధిపత్యం సాదించినవారు నాగరీకులై గ్రామాలు ఏర్పాటు చేసుకుని, రాజ్యాలుగా ఏర్పడి మనుగడ సాగించారు - వీరినే మనం నాగరీకులు అంటున్నాం, వీరు బయటి ప్రపంచంలో జీవనం సాగించటం వల్ల వీరి భాషా నాగరికత వెలుగులోకి వచ్చాయి, చరిత్ర కెక్కాయి.
కాగా అల్పసంఖ్యాకులు నాగారీకులకు దూరంగా అడవుల్లో జీవనం సాగించారు - వీరినే మనం గిరిజనులు అని నేడు పిలుస్తున్నాం. వీరి భాషా నాగరికతలు అతి ప్రాచీనమైనవే అయినా వీరు బయటి ప్రపంచంలో లేకపోవడంతో అవి వెలుగును కోల్పోయాయి. వీరి భాషా నాగరికతలు అభివృద్దికి నోచుకోలేక పోయాయి.
దానితో కొన్ని జాతుల భాషలు కేవలం వాడుక భాషలుగానే మిగిలి, ప్రత్యేక లిపి లేకుండా పోయాయి.
మహబూబ్ నగర్ నల్లమల కొండ ఫరహాబాదులో నివసించే చెంచులు దక్షిణ భారతంలోనే అత్యంత ప్రాచీణ జాతి వారుగా తెలియబడుతుంది. వీరు ఆస్ట్రేలియా ఆస్ట్రలాయిడ్ కొండ జాతికి చెందిన వారుగా భావించబడుతుంది.
ఈ జాతి వారు ఇక్కడి నుండే వివిధ దేశాలకు వలస వెళ్లి ఉండొచ్చని కొందరి అభిప్రాయం.
ఏది ఏమైనా ఈ జాతి వారు అత్యంత్య ప్రాచీన జాతి వారనునది మాత్రం నిర్వివాదాంశం.
హైదరాబాదు సమాచారము వారికి ధన్యవాదములతో.... అందులోనుండి కొంత ముఖ్యభాగం
No comments:
Post a Comment