Tuesday, 22 October 2013

తెలంగాణా జాతకం - ఇలా కూడా చెప్పొచ్చా?

"ఇది విమర్శ కాదు - నాకు వచ్చిన సందేహం"

జాతకం ఇలా కూడా చూడవచ్చా? అనే నా సందేహాన్ని విజ్ఞులు నివృత్తి చేయమనవి. 

మొన్నామద్య 11-10-2013 న బ్లాగులు వెతుకుతుంటే Telangana is Inevitable అనే ఒక టపా కనిపించింది, ఆసక్తితో వెళ్లి చదివాను
అది 15-9-2013 టైమ్స్ అఫ్ ఇండియా దిన పత్రికలో 25 జులై 2014 తరువాత తెలంగాణా ఏర్పాటు జరుగుతుంది  అంటూ
జ్యోతిష్కులు చెప్పిన వార్త అది 

 అయితే ఆ వార్తలో నాకు ఏర్పడ్డ సందేహం ఏమంటే :

 సజంగా ఏ  జాతకమైనా చూడడానికి  జన్మించిన/ఏర్పడ్డ సమయాన్ని తీసుకుంటాం,
ఆ పద్దతిన తెలంగాణా-ఆంధ్ర కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డ 1-11-1956 నాటిని  తీసుకోవాలి
కాని అక్కడ దానికి భిన్నంగా ఆంధ్ర రాష్ట్రం అవతరణ తీసుకోబడింది (1-10-1953)
అదే నాకు అర్థం కాకున్న విషయం.
అలా కూడా చూడవచ్చా? లేక అక్కడ పోరాపాటేమైనా జరిగిందా అనేది నా సందేహం?

జాతకం చూసి చెప్పినతను అరవ మహా పండితుడు కూడానూ?
తేదీల్లో పొరపాటు జరిగిందేమో అనుకుందామా అదీ లేదు! ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ నవమి తిథిని గట్టిగా చెప్పుకొచ్చాడు

 అంతేగాక  అరవ పండితుల వారు చెప్పిన విషయాన్ని,  ఆ బ్లాగు పండితులవారు కూడా బలపరచారు


టైమ్స్ అఫ్ ఇండియా పత్రిక వారికి ధన్యవాదములతో 

15-9-2013 న టైమ్స్ అఫ్ ఇండియాలో ప్రచురించ బడిన ఆ వార్తలోని ముఖ్య  విషయాలు  ఇక్కడ ఉంచుతున్నాను
పూర్తి వార్తను ఈ క్రింది లింక్ లో చూడవచ్చు:
http://articles.timesofindia.indiatimes.com/2013-09-15/visakhapatnam/42080246_1_telangana-state-seemandhra-bifurcation

Separate Telangana state inevitable, predict astrologers 

 
Predicting extremely bright chances for the formation of Telangana after July 25, 2014, astrologers said that tussles over key issues like water and property between the newly formed states would continue for some years. Overall, vast differences would crop up among Telugu speaking people for some years due the bifurcation as well as a lack of dynamic leadership to rule the new states, they opined. 

“Telangana state will be formed and nobody can stop it as the stars are most favorable to Telangana, whereas Andhra Pradesh is presently passing through an inauspicious phase as per the time and date of its formation on October 1, 1953,” said Acharya Ravviji, a senior astrologer and secretary of the Chennai-based International Astrological Science Congress.
 
According to Ravviji, the alignment of the stars was not right when Andhra Pradesh was carved out of Madras Presidency. “It was Navami by tithi and Krishna Paksha on October 1, 1953, which was an inauspicious period. Because of this, Andhra Pradesh is presently passing through Kuja Mahadasa, which causes protests, fights between groups, differences among people’s ideologies etc,” he explains


పాత టపాలలో నా జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం 27 డిసెంబర్ 2013 లోపే తెలంగాణా రాష్ట్రం ఏర్పడనుంది.6 comments:

 1. నాకు జాతకాలమీద నమ్మకం లేదు!కాని అతి తొందరలో తెలంగాణా రాష్ట్రం ఏర్పడటం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది!

  ReplyDelete
 2. నిజానికి తెలంగాణ...నిజాం పాలన నుండి స్వతంత్రయైన తేదీ (17-09-1948) ని తీసుకోవలసింది. లేదా, తెలంగాణ స్వతంత్రతను కోల్పోయిన తేదీ (01-11-1956) నైనా తీసుకోవలసింది. ఈ రెండూ కాకుండా ఆంధ్ర రాష్ట్రావతరణ తేదీని తీసుకొన్నారంటే, ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏదేమైతేనేం మన తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పడనుందనే శుభవార్త చెప్పారు. సంతోషం.

  ReplyDelete
  Replies
  1. శుభవార్తే అయినా, మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ అవతరణ 1-11-1956 రోజును తీసుకోవడమే సరైనది. నిజాం పాలన నుండి స్వతంత్రమైన తేది తీసుకుంటే హైదరాబాదు రాష్ట్రం కిందికి వస్తుంది, అది కూడదాయె. ఇక ఆంద్ర రాష్ట్రం రావటమూ పోవటమూ జరిగిపోయాయి.
   నేటి పరిస్థితుల గ్రహించి ఏ సామాన్యుడైనా తెలంగాణా వస్తుందనే చెపుతాడు. అది జ్యోతిష్యం కిందికి రాదు కదా? బేసిక్ ఏదన్నా ఉండాలి కదా జ్యోతిష్య వార్త అన్నపుడు!

   Delete
 3. Jai Telangana, we already lost our first generation..who faught for that..at least few politicians raised that moment after reading from books..now congress is seperating on political benefit..we could got this state in 10yrs..at least we are better now after 60yrs political people wish fulfilled..we have to thank our parents on joining visalandhra moment..otherwise we won't have this Hyderabad..at least our telugu community proved that we can build competent states in India..no need to quarrle among us, enjoy new state moments and be nice with others and serve for telangana, at least now time to work..so far we are fighting for new state, doing nothing and eating tax money and killing innocent people like Umesh mehtha and TDP MLA Madahava Rao..1000's of innocent people ( due to annalu)..at least these killing will end soon..even earth need some peace..

  ReplyDelete
 4. సత్యమేవ జయతే...న్యాయమేవ జయతే...తెలంగాణైవ జయతే...

  జై తెలంగాణ! జై జై తెలంగాణ!

  ReplyDelete