Wednesday, 23 October 2013

తెలంగాణుల చరిత్ర-1 అతి ప్రాచీన జీవకోటి నిలయం తెలంగాణా ప్రాంతం

ప్రపంచంలో అతి ప్రాచీన జీవరాశి నెలకొన్న ప్రదేశం తెలంగాణా
ఇక్కడ బయలు పడ్డ ప్రాచీన అవశేషాలు ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతి ప్రాచీన జీవరాశి నిలయం అని చెబుతుంది
 ఒకప్పుడు ఇది దట్టమైన అడవులతో నిండి ఉండేదన్నది సత్యం.
అంతే గాక ప్రాచీన మానవ యుగాలకు చెందిన ఎన్నో అవశేషాలు ఇక్కడి తవ్వకాలలో బయలు పడ్డాయి. 
ఇక్కడ బయలు పడ్డ నాగరికతలు హరప్పా, మొహంజాదరొ నాగరికతలతో పోలి ఉన్నాయి
ప్రాచీన మానవులు ఇక్కడ నివాసమున్న ఆనవాళ్ళు ఎన్నో బయటపడ్డాయి
నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి  జిల్లాలలో ఎన్నో అవశేషాలు దొరికాయి.

కొడకండ్ల, మధిర, డోర్నకల్లు, బేగంపేట, దిండిగల్, మౌలాలి,  బేగంపేట, కిష్టాపురం, జానంపేట, ఘనపూర, 
గోన్పాడ్, జడదొడ్డి, జమ్మిచేడు, కందూర్, కొండపల్లి, కొండపర్తి, మహబూబ్ నగర్, చింతకాని,  మంచుపల్లె, నడిమల్ల, పోల్కంపల్లి, తాడికొండ, తిర్మలాయిపల్లి, ఉర్కొండ........... 
మొదలుగాగల ప్రాంతాలలో ఆదిమ మానవుల అవశేషాలు, సమాధులు, పనిముట్లు బయట పడ్డాయి. 

విశేషమైన అడవులు, నదులు, కొండలు, గుట్టలు కలిగి ఉండి జీవరాశులకు, ఆదిమ మానవులకు
ఆవాస యోగ్యంగా ఉండింది తెలంగాణా ప్రాంతం 


ఆంధ్రజనత దినపత్రిక వారికి ధన్యవాదములతో
ఆంధ్రజనత 30-4-1973


 

2 comments:

  1. అతి ప్రాచీన జీవరాశి అంటే అమీబా, వైరస్‌ల కన్నా ముందు ఆవిర్భవించిన జీవరాశి గురించి చెపుతారేమో అనుకున్నా. మానవుడు ఆవిరభవించిన కాలాన్ని మనం అప్పుడే అతి ప్రాచీనంలోకి తీసుకురాలేమేమో. ఏదేమైనప్పతికీ ప్రపంచమానవ చరిత్ర వికాసక్రమంలో మన రాష్త్రంలోని అనేక ప్రాంతాలు చోటు చేసుకోవటం ఆసక్తిదాయకమే.- Sarath

    ReplyDelete