Thursday 17 October 2013

శ్రీశైలంలో బయలుపడ్డ సొరంగం!

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్ర్రీశైల క్షేత్రం ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం జరుపుతున్న తవ్వకాలలో 1 అక్టోబర్ 2013 న  ఒక సొరంగం బయట పడింది. 
ఇది ఒక మండపం అని తెలియబడుతుంది
ఏ కాలానికి చెందినది, దాని యొక్క ప్రాశస్త్యం గాని పురాతత్వ శాస్త్రజ్ఞుల పరిశోధనలో గాని తెలియరాదు. 
దేవాలయ సొరంగం అనగానే చాలా మందికి వెంటనే స్ఫురించేది పద్మనాభ స్వామి ఆలయంలో బయలుపడిన అనంత ధనరాశులు.
కాని ఇది ఆ కోవకు చెందినదై ఉండక పోవచ్చు - కారణం బయల్పడిన ప్రదేశం భిన్నమైనది .

మల్లిఖర్జునస్వామి గుడి వెనకాల, భ్రమరాంబ అమ్మవారి ఆలయం ముందున, మద్యలో పక్కవైపున
వీరశైవ పంచాచార్య జగద్గురువుల శ్రీ సూర్య సింహాసన పీఠం ఉంది - ఇది అతి ప్రాచీనం
పురాణాల్లో కూడా ఈ జగద్గురువుల ప్రశస్తి కలదు
ప్రాచీన కాలంలో దట్టమైన అడవులతో కూడిన ఈ శ్రీశైలం వచ్చే భక్తులకు వీరు సౌకర్యం కల్పించేవారు
అలాగే ఎన్నో విషమ రోగాల నివారణకు ఎంతోమంది ఇక్కడ వచ్చి ఈ జగద్గురువుల చికిత్సను పొందేవారు
ఇక్కడ నెలల తరబడి ఉండి చికిత్స పొందటానికి వారి సౌకర్యార్థం ఈ సూర్య సింహాసన పీఠం/మఠంలో మండపాలు ఉన్నట్లు తెలుస్తుంది - బహుశా ఇది అలాంటిదై ఉండవచ్చు.
లేదా
సహజంగా మఠములలో నేలలోపల పూజామందిరం, ధ్యాన మందిరం ఉంటాయి.
చాలా వీరశైవ మఠములలో నేటికీ ఇవి కనిపిస్తున్నాయి - బహుశా ఇది అలాంటిది అయినా అయి ఉండవచ్చు.

అంతేగాని మల్లిఖార్జున స్వామి ఆలయానికి సంబందించిన ధనాగారం లాంటిది ఖచ్చితంగా కాబోదు.

ఏది ఏమైనా మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!








3 comments:

  1. శ్రీశైలంలో బయటపడ్డ సొరంగం కూడా మా తెలంగాణా నవాబులే కట్టించారు. కాబట్టి శ్రీశైలం కూడా మాకే చెందాలి. శ్రీశైలం చుట్టు పక్కల సీమాంధ్రులు అంతా తట్టాబుట్టా సర్దుకుని పోవాల్సిందే అని రాయాల్సింది తమ్మీ... పోస్ట్ మరీ కూల్ గా ఉంది. కాసింత తెలంగాణా మసాల దట్టించి ఉండాల్సింది. ఎలాగూ బర్మా వరకూ వెళ్లావు కదా.. శ్రీశైలాన్ని మాత్రం ఎందుకు వదిలినట్టో...

    ReplyDelete
  2. వేరోకడి కూటికి ఆశపడే నీచ నికృష్ట బుద్ది తెలంగాణా వాడికెపుడూ లేదన్నయ్యా!
    ఇక ఆ దరిద్రపు బుద్ది ఎవడికుందో ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమేగా పెద్దన్నా!!!

    ReplyDelete
  3. Cheppu petti kottinattu cheppru Sir, Good reply... Jai TG

    ReplyDelete