Wednesday, 16 October 2013

తెలంగాణా వారు రాహు కాలం పాటించాలా?

రాహు కాలం అనేది తెలంగాణా ప్రాంతంలో వెనకటి నుండి ఆచారంలో లేదు - ఇప్పుడు కూడా లేదు కూడా
ఈ ఆచారం ప్రధానంగా తమిళ నాట ముందు నుండీ ఉంది.
ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో తమిళులతో జీవనం సాగించి వచ్చిన ఆంద్ర పండితుల వలన
తెలంగాణాలో కూడా ప్రవేశించటం జరిగింది.

తెలంగాణలో ప్రచురించ బడిన కోస్గి పంచాంగం మొదలుగా గల పంచాంగాలలో గాని
తెలంగాణలో ప్రచురించబడిన జ్యోతిష్య గ్రంధాలలో కాని రాహుకాలం చర్చ లేదు.

ప్రస్తుతం తెలంగాణా ప్రాంతంలో రాహుకాలం వాడుకలో లేదు
ఎవరైనా పంచాంగ కర్తలు / కేలెండర్ పంచాంగ కర్తలు అందరికీ అన్ని విషయాలు అందుబాటులో ఉండాలి
అని ఇవ్వటం తప్ప - వాటిని తప్పక ఆచరించాలి అని ఇవ్వటం లేదు

ఇక రాహుకాలం ప్రస్తావన తెలుగు పండితులలో/పంచాంగాలలో వచ్చింది పూర్తిగా నవీనం
ప్రాచీనకాలం నుండి రాహుకాలం ప్రస్తావన లేదు

జ్యోతిష్య/ధర్మ గ్రంధాలలో ప్రధానమైనవిగా చెప్పబడే
ధర్మసిందు, నిర్నయసిందు లలో 
కాలామ్రుతం,  ముహూర్తమార్తాండం, ముహూర్త చింతామణి, ముహూర్త దీపికలలో 
భ్రుగు, వశిష్ట, నారద, గార్గ సంహితలలో గాని
రాహుకాలం గురించి చెప్పబడలేదు.

ఇంకా చాంద్రమానాన్ని పాటించే తెలుగు వారికి వర్జ్యమే ప్రధానం - రాహుకాలం చెప్పబడలేదు

ప్రధానంగా జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్న ఏకవింశతి (21) మహాదోషాలలో రాహుకాలం చెప్పబడలేదు.
ఏకవింశతి మహాదోషాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

నిజానికి ప్రధానంగా రాహువును  ఒక ఛాయా గ్రహంగానే ప్రాచీన జ్యోతిష్య శాస్త్రాల్లో ప్రస్తావించటం జరిగింది
దానికి విశేష ప్రాధాన్యం కూడా ఇవ్వబడలేదు  అన్నది సత్యం
అయితే
మనిషి ఆలోచనతో బాటు పెరుగుతున్న ఆశలతో వచ్చి చేరుతున్న కొత్త కొత్త కథనాలు జ్యోతిష్య శాస్త్రంలో కోకొల్లలు.
వాటిలో ఈ రాహుకాలం ఒకటి 
 
కాలక్రమంలో వచ్చి చేరుతున్న, తెలంగాణాలో ఆచరణలో లేని ఇలాంటి నవీన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు - వాటిని పాటించక పోవుట విషయంలో సందేహమూ అక్కరలేదు. 
రాహు కాలంలో ఏదైనా శుభ కార్యం చేస్తే చెడుతుందేమో అన్న మీమాంస అక్కరలేదు
అలా అనుకుంటే తరాల నుండీ మన పెద్దలు పెట్టుకుంటూ వచ్చిన శుభ ముహూర్తాల నన్నిటినీ తప్పు పట్టాల్సిన దేనా?
వారు పెట్టిన కార్యాలు శుభాల నివ్వలేవా?

ఇక రాహుకాలం నేను పరిగణిస్తాను - పాటిస్తాను అనేవారిని తప్పు పట్టాల్సిన పని కూడా లేదు
ఎవరి స్వఅభిప్రాయం వారిది - ఎవరి నమ్మకం వారిది
అయితే మన తెలంగాణాలో కాని/తెలుగు వారి ఆచారాల్లో కాని రాహుకాలం చెప్పబడలేదు.








10 comments:

  1. ఇప్పుడు బ్లాగులలో జరుగుతున్న చర్య తెలుగువారు రాహుకాలం పాటించడం గురించి...తెలంగాణవారు రాహుకాలం పాటించడంగురించి కాదు. మీరు కష్టపడి ఇంత పోస్ట్ రాశారు. అయినా మీకు తెలంగాణతల్లి విజయశాంతి ఉందిగా. ఆమెను అడగండి పాటించొచ్చో, లేదో.

    ReplyDelete
    Replies
    1. voorike anaaledu kcr andhraa lo medhavi leru ani ... thala thokaa leni comment lu manu

      Delete
    2. రాహుకాలం అనేది ప్రాంతీయంగా ఆచరించబడుతున్నది అన్న సత్యం ముందు తెలిసుకో అవివేకోత్తమా!
      అయినా తెలుగువారు సివసించే ప్రాంతానికి ఏర్పడిన పేరే తెలంగాణా అని తెలియని అంధులకు ఈ టపా ముఖ్యోద్దేశ్యము అర్థం కాకపోవుటలో ఆశ్చర్య పడాల్సిన పనేలేదు.
      "పోగాలము దాపురించిన వాడికి బుద్దులు గరపుట బూడిదలో పన్నీరు పోసినట్లు" అని పెద్దలు ఊరకే అనలేదు సుమా!
      ఎవరిని ఏది అడగాలో ఎవరిని ఎక్కడ వదిలి పెట్టాలో మాకు బాగా తెలుసు-అది గ్రహిస్తే మంచిది.

      Delete
  2. సీమాంధ్రులకు తల్లులు లేరేంటి?
    జ్యోతిలక్ష్మి, జయమాలిని .... !!!

    ReplyDelete
  3. త్వరలో రాహుకాలం అందరికి వచ్చెస్తుంది. ఎందుకంటే next PM రాహుల్ గాంధి కదా...

    ReplyDelete
  4. వారెవరైనా ఎలాంటి వారైనా తల్లులు తల్లులే, తల్లీ అని తల ఎత్తుకుని చెప్పవలసిన పదం అది. ఒక విజయశాంతి కావచ్చు, జ్యోతిలక్ష్మి కావచ్చు, జయమలినీ కావచ్చు మరెవరైనా కావచ్చు, తల్లి అని సంభోదించటానికి అందరు మహిళలూ అర్హులే. తాము బుగ్గిపలై పదిమందికి వెలుగు నిచ్చిన వీరిని తల్లీ అని సగర్వంగా సంభోదించిన వాడే అసలైన మనిషి. ఆ సందేశం చెప్పటానికే ఈ వ్యాఖ్యాలు తోలిగించలేదు అని మనవి. తెలంగాణాకై ఉద్యమించిన విజయశాంతిని తల్లీ అని సంభోదించి తలవంచుటలో ప్రతి తెలంగాణా ఉద్యమ కారుడు ముందే ఉంటాడు అని గ్రహించాలి.

    ఇక రాబోయే రాహుల్ అలనాటి బుద్దవతారమైన రాహుల్ అవుతాడా? లేక రాహువు అవుతాడా అన్నది వేచి చూడాల్సిందే మరి!

    ReplyDelete
  5. టపా తెలంగాణా వారు రాహు కాలం పాటించాలా? అన్నది మీరు ప్రత్యేకంగా వ్రాయటంలో ఆంతర్యం నాకు బోధపడలేదు. నేను ఇప్పటికే నిన్న తెలుగువారు రాహుకాలం పాటించాలా? అన్న వ్యాసం ప్రకటించాను కదా? అందుచేత తెలంగాణా వారు రాహు కాలం పాటించాలా? అని మీరు విడిగా ఒక టపా వ్రాయలసిన అవసరం కనిపించటం లేదు. అలాగని మీరు కొత్తగా చెప్పిన సంగతీ, కేవలం తెలంగాణా వారికే వర్తించే సంగతీ కూడా మీ వ్యాసంలో ఏమీ కనిపించటం లేదు.

    తెలంగాణావారు కూడా తెలుగువారే . తెలుగువారందరూ కోస్తాప్రాంతం వారూ, రాయలసీమవారూ, తెలంగాణావారూ అంతా వర్జ్యం, దుర్ముహూర్తం అనేవి ప్రధానంగా పాటిస్తారు. విషయమై మీరు వ్రాసిన వాక్యంలో‌ దుర్ముహూర్తం మాట చేర్చండి.

    ఒకవేళ మీరు, మా తెలంగాణా వారం తెలుగువారము కాదూ, కాబట్టి మాకోసం మేము వేరే వ్యాసం వ్రాసుకున్నామూ అంటున్నారా? అలా గని నేను అనుకోను. మీరే "చాంద్రమానాన్ని పాటించే తెలుగు వారికి వర్జ్యమే ప్రధానం" అన్న వాక్యం వ్రాసారు కదా!

    మీ వ్యాసం ఉద్దేశం మీద నా అనుమానం అలా ఉంచి, మీరు నా వ్యాసం తెలుగువారు రాహుకాలం పాటించాలా? లోని అభిప్రాయంతో ఏకీభవించినందుకు చాలా సంతోషం.

    ReplyDelete
    Replies
    1. తెలంగాణా-ఆంద్ర ప్రాంతానికి తేడా ఉంది. మునిగిపోయినవాడికి - ఒడ్డుపైన ఉన్న వాడికి తేడా.

      ఆంధ్ర ప్రాంతీయులు చాలా కాలం నుండి రాహుకాలం అనుసరిస్తున్నారు, దీనికి ప్రభల నిదర్శనం 1925 నాటికే ఆంధ్ర పత్రిక పంచాంగాలలో రాహుకాలం ప్రత్యేకంగా ప్రచురించడం.

      నమ్మినా నమ్మకపోయినా సత్యమేమంటే తెలంగాణా ప్రాంతం వారికి రాహుకాలం గురించి తెలియకపోవడం, ఇప్పటికీ తెలంగాణా పండితులు వాటి ప్రస్తావనే తేవకపోవటం.

      ఇక ఏకవింశతి మహా దోషాలలో వార దుర్ముహూర్త దోషం కూడా ఒకటి-అది పాటించవలసిందే.

      అయితే ప్రధానంగా వర్జ్యాన్ని (తాజ్యము-విడువతగిన సమయము) ఏకవింశతి దోషాలలో "విషదోషం" గా వర్ణించబడింది.

      నక్షత్రములొని అమృతఘడియల ఎలా ప్రధానంగా గ్రహించామన్నారో అలానే నక్షత్ర త్యాజ్యమును కూడా అంతేగా విడిచిపెట్టవలెననీ చెప్పటం జరిగింది.

      Delete
  6. తెలంగాణ వ్యుత్పత్తి గురించి కొంచెం ఆలోచించాలె. ఒకటి. తెలంగాణ కాదు , తెలంగాన . ఇది తెలంగాన వారు ఇచ్చిన పేరు కాకపోవచ్చు. ఇక్కడ పాలకులై ఏలిన మరాఠీలు గాని , ముస్లింలు నిర్ణయించిన పేరయినట్టు ఉన్నది. తెలుగును తెలంగీ అని మనము అనము కదా. మరాఠీలో తెలంగ్ అంటె తెలుగు.

    ఇకపోతె రాజ్ పుటానా , గోండ్వానా అని ఢిల్లీ పాలకులిచ్చిన పేర్లు కలవు. అట్లనె తెలంగీ మాట్లాడె ప్రాంతం తెలంగానా అయి ఉండనోపు. ఆ విధంగా తెలంగానా అసలు పదం. తెలంగాన మరియు తెలంగాణ మనం జోడించిన కల్పనలు. తెలంగానా శబ్దం లోనె అరబ్బి పారశీక మేధావిత్వపు తృణీకారం గోచరిస్తున్నది. మరాఠీలు మనలను ఆ కాలంల ఏలిన వైనాలు వేరె చెప్పాల్నా ?మన ప్రాంతమునే అట్ల పిలిచినపుడు మన ఊరి పేర్లు జిల్లాల పేర్లు సామరస్యానికి చిహ్నాలైతె కావుకద ! అనుమ కొండ హనమ్ కొండ ఎట్లయింది ? కాయస్థ మరాఠీ అధికారులకు అంతటి ప్రతిపత్తి ఉండె.

    మనం రాహుకాలం పాటించుడటుంచి , మా వరంగల్లు లో బ్రాహ్మణ శ్రేష్టులైన వకీల్లు షేర్వానీలు తొడిగి నమాజు చేసింది మాకెరికే. ఇప్పుడు ఎన్నయిన బీరాలు పోవచ్చు గాక.

    ReplyDelete