Tuesday, 15 October 2013

బతుకమ్మను తెరపై తెచ్చింది తెలంగాణా సంగీత సామ్రాట్టే

చిత్రసీమ శత వసంతాలు పూర్తిచేసుకుంటున్నా బతుకమ్మ పండగ కాని, బతుకమ్మ పదం కాని
తెలుగు తెరపై ఏనాడూ కనిపించలేదు, వినిపించలేదు - ఆ గౌరవం ఆ పండగకి దక్కనే లేదు
రకరకాల పూలతో చేసే బతుకమ్మలు, అందమైన పట్టు చీరలతో ఆటపాట లాడే ఆడపడుచులు
ఇంత మనోహర దృశ్యం మరి తెరపై చూపడానికి ఎందుకు వెనుకంజ చూపారో అర్థం కాదు?
ఇదే కాదు తెలంగాణాలో జరిగే పలు పండగలు, ఉత్సవాలు కూడా తెలుగు తెరపై ఆదరణకు నోచుకోకపోవడం దురద్రుష్టకరం.

అయితే ఏటికి ఎదురీది
బతుకమ్మను తెరపై కనిపించి, వినిపించే ప్రయత్నం చేసిన సంగీత సామ్రాట్ శంకర్
సుప్రసిద్ద శంకర్-జైకిషన్ సంగీత జంటలో ఒకరు హైదరాబాది శంకర్
పద్మశ్రీ శంకర్-జైకిషన్ ల సంగీతం ఎంత పాపులర్ అన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు
వారి సంగీత దర్శకత్వంలో వచ్చిన వన్నీ సూపర్ హిట్ అయ్యాయి - ముఖ్యంగా రాజ్ కపూర్ సినిమాలు.
1950, 1960, 1970 దశకాల్లో చాలా హిందీ హిట్స్ అందించారు
తెలుగులో వీరు సంగీత దర్శకత్వం వహించిన జీవితచక్రం ఆల్ టైం హిట్. 
శంకర్-జైకిషన్ సంగీత ద్వయంలో ఒకరైన శంకర్  పూర్తి పేరు శంకర్ సింగ్ రఘువంషి
వారి తలిదండ్రులది మధ్యప్రదేశ్ అయినా శంకర్ పెరిగింది హైదరాబాదులోనే 
శంకర్ మొదట పహిల్వాన్, హైదరాబాద్ లోని తాలిం ఖానాలో కసరత్తులు చేసేవాడు
హైదరాబాదు సంస్కృతిలో పెరగడంతో, సంగీత దర్శకుడయ్యాక 
తెలంగాణాపై తనకున్న అభిమానంతో బతుకమ్మను తెరపై తెచ్చే ప్రయత్నం చేశాడు  శంకర్ 

 1969  శంకర్ గారు తన సంగీత దర్శకత్వంలో వచ్చిన షత్రంజ్ (రాజేంద్రకుమార్, వహీదా రెహ్మాన్)
సినిమాలో బతుకమ్మ పేరును వాడుతూ కొన్ని తెలుగు మాటలతో 
మెహమూద్, హెలెన్ పాత్రలపై చిత్రీకరించటం జరిగింది
అది బతుకమ్మ పాట కాకపోయినా బతుకమ్మను గుర్తు చేస్తూ తెరపై వాడబడిన తొలి పాట




Shatranj Film - Batkamma Song


తరువాత శంకర్ గారు 1971 లో వచ్చిన జీవితచక్రం తెలుగు సినిమాలో (ఎన్టీఆర్, శారద, వాణిశ్రీ)
శారద బృందం పై బతుకమ్మ ఆడుతూ ఒక పాట పెట్టటం జరిగింది
తెలుగులో శంకర్-జైకిషన్ లు సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది



Jeevitha Chakram - Batukamma Song



పై 2 పాటలు సూపర్ హిట్ అవ్వటం ఒక విశేషం. 
ఆ తరువాత సినిమాల్లో బతుకమ్మ కనిపించిన దాఖలాలు లేవు
తెలంగాణా ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తరుణంలో గత 5-6 ఏళ్ల నుండే బతుకమ్మకు ఒక గుర్తింపు వచ్చింది
ఈ మద్యన తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో బతుకమ్మ పేరుతో సినిమా కూడా తీయబడడం హర్షించదగ్గ విషయం.
ఇక ముందైనా మన తెలుగు సినిమాల్లో బతుకమ్మ పాటలకు చోటు దక్కుతుందని ఆశిద్దాం




2 comments:

  1. Thank you for the two links.

    Shankar used Telangana folk traditions in many compositions. శ్రీ 420 సినిమాలోని రామయ్యా వస్తావయ్యా పాట కూడా తెలంగాణా జానపదం నుండి వచ్చినదే.

    ReplyDelete
  2. It's an evidence that How cleverly sidelined almost half of the people's tastes and heart beats all these years....!

    ReplyDelete