Monday, 14 October 2013

పండగలకు ఏకాభిప్రాయం అత్యవసరం

వెనకటి కాలంలో పండితులు తక్కువగా ఉండేవారు - ఎవరో ఊరికి ఒకరు ఉంటే వారి మాట జవదాటేవారు కాదు
వారు చెప్పినట్టే ఆ రోజు పండుగలు జరుపుకునే వారు
వేరే ప్రాంతంలో వేరొక విదంగా చెబితే అక్కడి వారు ఆవిధంగా ఆ రోజు  జరుపుకునేవారు
  అప్పుడు కూడా తేడాలతో జరిగినా ఈనాటిలా మీడియా ప్రపంచం లేక అంత వ్యత్యాసం ఏర్పడేది కాదు

ఇప్పుడు పండితులూ ఎక్కువయ్యారు - మీడియా ఎక్కువయింది
ఒకే ప్రాంతంలో పది మంది పండితులు పదిరకాల చెప్పే పరిస్థితి నేటిది
ఇక్కడ ఎవరి వాదనా కొట్టి వేయటానికి వీలుండదు - ఎందుకంటే ఒక్కొకరు ఒక్కో శాస్త్రాన్ని/గ్రంధాన్ని అనుసరించి వాదిస్తారు.

ప్రస్తుతం దసరా పండగ జరుపుకోవటంలో సందిగ్దం ఏర్పడింది
అయినా తెలంగాణా పండితులు ఒకచో కూర్చుని చర్చించుకుని దసరా పండగ 13-10-2013 న జరుపు కోవాలని చెప్పటం వలన 
దాదాపు తెలంగాణా అంతటా నిన్ననే (13-10-2013) నే జరుపుకున్నారు  
కాని హైదరాబాదులోనే కొంత తేడా వచ్చి 13 నాడు కొంతమంది 14 నాడు కొంతమంది జరుపుకోవటం జరిగింది
దీంతో పండగ వాతావరణం కనిపించకుండా పోయింది

తెలంగాణా ప్రాంతంలో దసరా పండగ నాడు శమీ పూజ ముఖ్యంగా భావిస్తారు అది సాయంత్రం పూట జరుగుతుంది. 
కొత్త బట్టలు వేసుకుని జనులు సమకూడె ప్రదేశంలో హనుమంతుడు ఉండే కాషాయ జెండా ఎగురవేసి
శమీ చెట్టును చేరి పూజించి వాటి ఆకులు తెంపుకుని  ముందుగా దేవాలయం వెళ్లి దేవునికి బంగారం (జమ్మి) సమర్పించి  ఆ తరువాత ఇంటికి వెళ్లి ఇంట్లో దేవునికీ, పెద్దలకూ సమర్పించి
ఆపైన స్నేహితులు, శ్రేయోభిలాషుల కలిసి  అలాయ్-బలాయ్ తీసుకోవటం జరుగుతుంది
ఇదంతా సాయంత్రం తరువాత జరుగుతుంది.
దశమి నిన్న సాయంత్రం ఉంది ఈనాటి సాయంత్రం లేదు
అందుకే నిన్నపండగగా నిర్ణయించబడింది - అది సబబే 

అయితే శాస్త్రం ప్రకారం పండగల సందర్భంలో సూర్యోదయానికి ఆ పండగ తిథి ఉన్న దినాన్నే గ్రహించటం జరుగుతుంది - ఆవిధంగా దశమి నిన్న సూర్యోదయానికి లేదు - ఈనాడే ఉంది కాబట్టి ఈనాడు చేసుకోవటం కూడా సబబే - ఇది ఇంట్లో శమీ కొమ్మ తెచ్చి దేవుని దెగ్గర పెట్టి పూజించే వారికి బాగా ఉపయుక్తం.
కాని సామూహికంగా జరుపుకునే సాయంత్రం శమీ పూజ సమయంలో లేకపోవటం లోటే అవుతుంది. 

ఏది ఏమైనా పండితులు ఏకాభిప్రాయానికి రావటమే కాకుండా
ప్రభుత్వం కూడా అధికారికంగా వివరణ యుక్తంగా పండగ ఏ రోజు జరుపుకోవాలన్నది ఒక ఒప్రకటన విడుదల చేస్తే
అందరికీ మంచిది - ఆ రోజు పండగలా కూడా అందరికీ అనిపిస్తుంది.




 

3 comments:

  1. ఈ విషయంలోశ్యామలీయం బ్లాగులో ఒక వ్యాసం వ్రాసాను చూడండి:‌ పండగరోజుల నిర్ణయంలో‌ తరచు గందరగోళాలకు కారణాలు

    ReplyDelete
    Replies
    1. >>>ఈ‌ రోజున అక్షరసత్యాలు బ్లాగులోని పండగలకు ఏకాభిప్రాయం అత్యవసరం అన్న టపాలో ఈ‌ వాక్యం చూసాను "శాస్త్రం ప్రకారం పండగల సందర్భంలో సూర్యోదయానికి ఆ పండగ తిథి ఉన్న దినాన్నే గ్రహించటం జరుగుతుంది". ఇది అన్ని సందర్భాలలోనూ వర్తించే సూత్రం కాదు. ప్రతి పండుగనూ నిర్ణంచటానికి ధర్మశాస్త్రగ్రంథాలు తరచు వేరే వేరే నియమాలు ఇస్తాయి. అన్నింటికీ ఒకే నియమం కాదు.

      నా వాక్యాన్ని ఉటంకించి అక్కడ రాసింది భిన్నం-పంచాంగ గణన తేడాలు వగైరా చర్చించారు. పోనీ పండుగలు ఎప్పుడు నిర్వహించాలి అన్న వివవరణ ఏమైనా ఉన్నదా అంటే అదీ లేదు? పండుగల నిర్ణయంలో భిన్న సంప్రదాయాలు అనే హెడ్డింగ్ కింద రాసిన శ్రీరామ నవమి విషయం అసంగతం, శ్రీరామ నవమి, కృష్ణాష్టమి అనేవి జనన సంబందమైనవి, తిథి ప్రకారం ఒకరు, నక్షత్రం ప్రకారం ఒకరు జరుపుకోవటం వారి వారి సంప్రదాయం - రెండూ కరక్టే. అలాంటి వాటికి ఒకదినాన్నేపాటింపజేయటం మరొకరి సాంప్రదాయాన్ని పక్కకు నెట్టడమే అవుతుంది - అది సరి కాదు.

      ఇక నేను రాసింది విజయదశమి గురించి - రెండు రోజుల్లోనూ రెండు ఆచరణల ప్రకారం పండగ జరుపుకోవటం జరిగింది - రెండు విధాలు సరిగ్గానే తోచినా సరైన ఒక విధానాన్ని అనుసరించటం మంచిది అని నా టపా రాయబడింది.

      వేరు వేరు పండగలకు వేరు వేరు నియమాల అక్కడ ప్రస్తావించటం అసంగతం కనుక నేను ఆ విషయాలు అక్కడ చర్చించలేదు - వాళ్ళు ఏ విషయ ప్రధానంగా రెండు రోజుల్లో జరుపుకున్నారు అనే విషయమే ప్రస్తావించటం జరిగింది. శుక్లపక్షంలో సూర్యోదయ తిథి గ్రహించటం ప్రాధాన్యంగా శాస్త్రంలో చెప్పటం జరిగింది కాబట్టి - ఆ విధంగా రెండవ రోజు పండగ జరుపుకున్నారు కాబట్టి అక్కడ ప్రస్తావించటం జరిగింది.

      ఎక్కడ ఏ విషయం ఎంతవరకు ప్రస్తావించడం సబబో అంత వరకే ప్రస్తావిస్తే చదువరులకు సౌలభ్యంగా ఉంటుంది. అంతే గాని పైన ఏదో శీర్షిక పెట్టి దానికి సంబంధం లేకుండా తలా తోక లేని అన్ని విషయాలు ప్రస్తావించటం వల్ల చెప్పదలచుకున్న విషయం పరమార్థం నెరవేరదు అని నా భావన.

      Delete
    2. స్వామిగారూ,

      మీరు నా పండగరోజుల నిర్ణయంలో‌ తరచు గందరగోళాలకు కారణాలు వ్యాసం మీద వ్రాసిన వ్యాఖ్యకు ఇక్కడ జవాబు ఇవ్వటానికి నాకు ఆసక్తి లేదు. మీకూ జవాబుమీద ఆసక్తి ఉందని అనుకోను. ఒక వేళ మీరు సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తి గలవారైతే నా వ్యాసానికి అక్కడే మీ వ్యాఖ్య ఉంచేవారేమో. అంతే కాదు మీ‌ వ్యాఖ్య ఏదో ఎత్తిపొడుపు వ్యవహారంలా ఉంది గాని హుందాగా విషయం చర్చించటానికో, వినయంగా తెలుసుకోవటానికో చేసే ప్రయత్నంలాగా లేక పోవటం విచారకరం. ఇలాంటీ ధోరణికి జవాబు చెప్పటం తరచుగా కుదిరే పని కాదు కూడా.

      మీరు మీ‌ టపాకు పండగలకు ఏకాభిప్రాయం అత్యవసరం అని శీర్షిక పెట్టారు కాని, "విజయ దశమి పండగకు ఏకాభిప్రాయం అత్యవసరం" అని కాదు కదా? కాబట్టి నా వ్యాసంలో విపులంగా చర్చించాను. మీకు నా వ్యాసంలో అనేక విషయాలు అసంగతతంగా అనిపించటమూ, నేను తలాతోకా లేని విషయాలు ప్రస్తావించాననటమూ మీ అవగాహనారాహిత్యాన్ని సూచిస్తున్నాయి. మీ‌ అవినయనాన్నీ‌ సూచిస్తున్నాయి.

      స్వస్తి.

      Delete