వినాయకచవితి తెలంగాణా స్పెషల్ తుమ్మికూర పప్పు
తెలంగాణావారు వినాయకచవితికి ఉండ్రాళ్ళ పాషంతో బాటు చేసే ఎంతో రుచికరమైన వంటకం తుమ్మికూర పప్పు.
ఎంతో ఔషద గుణాలున్న ఈ తుమ్మికూరను (Leucas aspera) వినాయక చవితి నాడు తెలంగాణాలోని ప్రతి ఇంటా తప్పక వండుతారు. దీని రుచి అమోఘం.
తుమ్మి కూర చెట్లు చెలక, రేగడి నేలల్లో వర్షాకాలంలో విరివిగా లభిస్తాయి.
తుమ్మి కూర చెట్లు చెలక, రేగడి నేలల్లో వర్షాకాలంలో విరివిగా లభిస్తాయి.
తుమ్మికూరకు ఉండే తుమ్మి పూలను వినాయకుని పూజలో తప్పక వాడతారు. (తుమ్మిపూలు శివునికి, విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరంగా చెప్పబడ్డాయి)
ప్రాచీన కాలం నుండి తెలంగాణా ప్రాంతంలో పంట పొలాల్లో, పొలాల గట్లా పెరిగే ఆకు కూరల వాడకం ఎక్కువ.
ఇప్పటిలా ఆకు కూరలు పండిచటం తెలంగాణలో ఉండేది కాదు.
ఆనాటి వాళ్ళు పూర్తిగా ఔషద గుణాలు కలిగి ఉండే ప్రకృతి సహజంగా పెరిగే ఆకు కూరలు వాడేవారు.
ఆనాటి వాళ్ళు వాడిన కూరలు ఎన్నో కలవు - మచ్చుకి కొన్ని:
ఆనాటి వాళ్ళు వాడిన కూరలు ఎన్నో కలవు - మచ్చుకి కొన్ని:
తెల్లగర్జెల కూర, పులిచింత కూర, నాగలిచెవు కూర, గట్టుగొర్మెడు కూర, పొనగంటి కూర, తుమ్మికూర, (సహజంగా పెరిగేవి)
పాయిలకూర, సన్న పాయలకూర, ముద్ద బచ్చలి, తీగ బచ్చలి (పెరట్లో దొరికేవి)
మునగ కూర, మెంతికూర, పుంటికూర, కుసుమ కూర, శనగ కూర, చింత కూర (పంటతో దొరికేవి)
పాయిలకూర, సన్న పాయలకూర, ముద్ద బచ్చలి, తీగ బచ్చలి (పెరట్లో దొరికేవి)
మునగ కూర, మెంతికూర, పుంటికూర, కుసుమ కూర, శనగ కూర, చింత కూర (పంటతో దొరికేవి)
పాలకూర, తోటకూర లాంటి పండించే కూరల వాడకం పెరిగాక పాత కూరల వాడకం తగ్గిపోయింది
అయినా తెలంగాణా పల్లెటూళ్ళలో ఇంకా చాలా వాడుకలోనే ఉన్నాయి.
కాగా ఎన్నో కూరలు మనకిపుడు ఔషధాల రూపంలో లభిస్తున్నాయి.
అయినా తెలంగాణా పల్లెటూళ్ళలో ఇంకా చాలా వాడుకలోనే ఉన్నాయి.
కాగా ఎన్నో కూరలు మనకిపుడు ఔషధాల రూపంలో లభిస్తున్నాయి.
తెలంగాణా ప్రాంతం ఎక్కువగా అటవీ ప్రాంతం, బంజరు ప్రాంతం కావడంతో తెలంగాణా ప్రాంతీయులు ప్రాచీనకాలం నుండీ ఎక్కువగా చెట్లపై ఆధార పడి జీవించారు.
తమకు ఆధారమైన చెట్లను పూజించటం తెలంగాణా వారి సంస్కృతి లో ఒక ప్రత్యేకత.
ప్రాచీన కాలం నుండీ తెలంగాణా వారికి చెట్లపై పూర్తి అవగాహన ఉండి వాటిలో ఎన్నో వంటకాల్లోనే కాక ఔషధాలుగా కూడా ఉపయోగించేవారు.
తెలంగాణా నాగరికత అతి ప్రాచీణం.
ప్రపంచంలో ప్రాచీన మానవుని జీవనం బయల్పడిన ప్రాంతాలలో తెలంగాణా ఒకటి.
తెలంగాణా నాగరికత ఎంత ప్రాచీణమో - అన్నిటిలోకి అంతే విలక్షణతను కలిగి ఉన్నది.
(భాష, నాగరికత, జీవనంలో అందరికంటే ప్రాచీణమూ, విలక్షణమూ అయిన, మరుగున పడవేసిన తెలంగాణా చరిత్రను ముందు ముందు పోస్టులలో వేయదలచాను)
>>(భాష, నాగరికత, జీవనంలో అందరికంటే ప్రాచీణమూ, విలక్షణమూ అయిన, మరుగున పడవేసిన తెలంగాణా చరిత్రను ముందు ముందు పోస్టులలో వేయదలచాను
ReplyDeleteమంచి ప్రయత్నం, అభినందనలు.
తుమ్మికూర పప్పును గత అర దశాబ్దంగా తినలేదు, miss it.