నిర్భయ ఆత్మకు శాంతి చేకూరింది
నిర్భయపై అత్యాచారం కేసులో నలుగురు దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించింది.
ప్రస్తుతం ఉన్నశిక్షల్లో కఠినమైన ఉరే వారికి సరి
అలాంటి నేరానికి ఇలాంటి శిక్షను విధించినందుకు మన న్యాయ వ్యవస్థపై భారత ప్రజలకు మరింత గౌరవ విశ్వాసాలు ఏర్పడ్డాయి.

చాలా మంది ఇలాంటి దోషులకు ఇదే సరైన శిక్ష అని హర్షాన్ని వ్యక్తం చేశారు.
కొందరైతే మరొకరు అలా చేయకుండా ఇలాంటి వారిని నడిరోడ్డునే ఉరితీయాలన్నారు
ఇలా ఉరి తీస్తేనే సమాజంలో మరొకరు అలాంటి ఘోరాన్ని చేయకుండా ఉంటారని ఆశను వెలిబుచ్చారు
హోంమంత్రి గారు కూడా ఈ ఉరి శిక్ష నేరస్తులకు హెచ్చరిక చేస్తూ సమాజంలో మార్పును తీసుకురావాలని కోరుకోవటం జరిగింది.
* * *
ఉరి నేరాల్ని నిరోధిస్తుందా?
హొమ్ మంత్రిగారు ఆశించినట్టూ ఉరితీస్తే మరొకరు చేయకుండా ఉంటారని ఆశించడం అత్యాశే అనిపిస్తుంది.
ఇంతకు ముందు కూడా పలు నేరాల్లో పలువురిని ఉరి తీయడం జరిగింది
ఉరితో అలాంటి నేరాలు అంతమైపోయాయా? అంటే లేదనే సమాధానమే వస్తుంది.
ఉరి ఎన్నిరోజుల వరకు నేరం చేయబోయేవాడికి హెచ్చరికలా పనిచేయ గలుగుతుంది?
ఉరే సరి అనుకుంటే - రోజుకు ఎంతమందిని ఉరి తీయాల్సి వస్తుంది?
భవిష్యత్తులో అలాంటి క్రూర నేరాలు మరొకరు చేయ సాహసించకుండా కొత్త చట్టాలు రావాలి
ఎవడు ఏ నేరం చేస్తాడో వాడి నొసటనో ముఖాన్నో కనిపించేలా ఆ నేరాన్ని అచ్చుగుద్ది సమాజంలో వదిలేస్తే సరి.

ఉదా: వాడు రేప్ చేస్తే రేపిస్ట్ అని ముద్ర వేయాలి.
(ఆ ముద్రను ఎవడైనా ప్లాస్టిక్ సర్జరీ వంటి వాటితో చెరపటానికి ప్రయత్నిస్తే అది నేరం కింద తేవాలి.)
సమాజమే వాడి సంగతి చూసుకుంటుంది
వాడి నేరానికి జనాలు అసహ్యించుకుని ఈసడించుకుంటారు
వాడితో ఎవరూ సంబందాలు పెట్టుకోక సంఘం నుండి బహిష్కరిస్తారు.
బంధువులు, స్నేహితులు, సమాజంలోని అందరూ వాన్ని దోషిగా చూస్తారు.
వాడిని నిత్యం కళ్ళముందు చూస్తూ వాడు అనుభవిస్తున్న అవస్థలు చూస్తూ మరొకడు అలాంటి నేరం చేయకుండా వెనుకడుగు వేస్తాడు.
ఉరిలాంటి శిక్షతో ఒక్కసారే చావకుండా, బ్రతికుండి అనుక్షణం వాడు చస్తాడు.
నేరస్తుని భౌతికంగా చంపటం కంటే మానసికంగా చంపటం పెద్ద శిక్ష.
అందుకే జైలు గోడల మద్య ఒంటరిగా ఉంచేది.
ఇది విపరీత ధోరణిలా అనిపించినా, న్యాయ వ్యవస్థకు ఆమడ దూరం కనిపించినా,
ప్రతినిత్యం కళ్ళ ఎదుట కనిపించే ఇలాంటి శిక్షల వల్లనైనా నేరాలు కొంతవరకైనా తగ్గగలవేమో!
భవిష్యత్తులో అలాంటి శిక్షలు వస్తాయేమో వేచి చూడాలి మరి.

No comments:
Post a Comment