నిజాం రాజ్యంలో ఒక పత్రిక తేవడమంటే సాహసమే అని చెప్పాలి.
అదొక రాచరిక వ్యవస్థ.
ఎన్నో ఆంక్షలు, ఎన్నో నిర్భందాలు మరెన్నో వేధింపులు.
అత్యధికులు తెలుగు మాట్లాడే వారే అయినా తెలుగు భాషకు ఆనాడు రాజగౌరవం లేదు
ప్రజల మాటల్లోనే కాని పరిపాలనలో తీసుకోబడలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర చరిత్ర సహా శతాధిక గ్రంధాల్లో చెప్పబడినట్లు
విశ్వామిత్రుని శాపానికి గురై ఉత్తరదేశం నుండి దక్షిణానికి వలసవచ్చిన ఆంధ్రులు
క్రీ.పూ. 2 శాతాబ్దిలో రాజ్యం ఏర్పాటు చేసుకుని సుమారు 400 ఏండ్లు పైన సాగించిన
పరిపాలనలో (ఆంద్ర రాజుల పరిపాలన లేదా శాతవాహనుల పరిపాలన అంటారు)
ఆంధ్రుల తమ ప్రాకృత భాషనే (Middle Indo-Aryan Language) రాజభాషగా చేసుకుని
సంస్కృత భాషను గ్రంధ, శాసనాదికాల్లో ఉపయోగించారు
అప్పటికి వేల ఏండ్ల నుండి ఇక్కడి ప్రజల భాషగా ఉన్న తెలుగును పక్కన బెట్టారు
ఆనాటి ఆంద్ర రాజుల నాలుగు వందల ఏళ్ల పై పాలనలో కనీసం ఏ ఒక్క గ్రంధమే కాదుకదా ఏ ఒక్క శాసనమూ తెలుగులో వేయబడ లేదు
ప్రజాభాయైన తెలుగు వెలుగు చూడ లేకపోయింది
(ఆంద్ర సాహిత్య చరిత్రలో పై విషయాలన్నీ సవివరంగా తెలుసుకోవచ్చని మనవి)
నిజాము కాలంలో కూడా ఉర్దూ భాషయే రాజభాషగా వాడబడి, తెలుగు ప్రజల భాషగానే ఉండిపోయింది
మాతృభాష తెలుగుభాషపై అభిమానాన్ని చూపిన తెలంగాణా వారి తెగువ
పూర్తి భాషా స్వాతంత్ర్యత ఉన్న చోట పత్రిక వెలువరించడం మామూలు విషయమే
కాని ఎన్నో ఆంక్షలు, నిర్భందాలు ఉన్నచోట వెలువరించటం అది కొంచెమైనా ఘనమే
ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నిజాంరాజ్యంలో తెలుగు పత్రికలను వెలువరించి
తమ తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్న నాటి తెలంగాణా మహామహుల గురించి, వారి పత్రికల గురించి తెలుసుకోవడం మన విధిగా భావిస్తూ ఆ నాటి పత్రికల గురించి ఇక్కడ ఉంచడం జరుగుతుంది.
ఇక్కడ ఉంచబడుతున్న సమాచారం యథాతథంగా
కైలాసవాసులైన శ్రీ పండిత చిదిరేమఠం వీరభద్రశర్మ గారి విభూతి పత్రిక నుండి గ్రహించ బడినవి.
వేదకావ్యస్మృతి తీర్థ, ధర్మాచార్య, విద్యానిధి సకల శాస్త్ర పారంగతులు అయిన వీరి పత్రికలో సర్వ విషయాలు వెలువరించ బడ్డాయి
5 సంవత్సరాల పైన వీరు విభూతి పత్రికను అజేయంగా వెలువరించారు
ఆపైన శ్రీవారు కాశీ జగద్గురు పీఠాన్ని అధిష్టించడంతో విభూతి పత్రిక ఆగిపోయింది.
విభూతి పత్రిక నుండి సంగ్రహించిన క్రింది వార్త కై వారికి కృతజ్ఞుడను
> ఆంద్ర సాహిత్య చరిత్రలో పై విషయాలన్నీ సవివరంగా తెలుసుకోవచ్చని మనవి
ReplyDeleteఈవాక్యానికి పైన వ్రాసిన పేరా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ విషయంలో వివరాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.
దయచేసి వివరాలు ఉన్నా యన్న ఆంద్రసాహిత్య చరిత్ర లభ్యత గురించిన సమగ్ర సమాచారం ఇవ్వగలరు.
శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారిచే రచించబడి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారిచే ప్రచురించబడిన ఆంధ్ర సాహిత్య చరిత్రలో 13, 14 వ పేజీలలో ఈ విషయాలు తెలుపబడ్డవి. ఈ పుస్తకం కాక పలు వ్యాసాల్లో కూడా ఈ చర్చ కలదని మనవి. ఆన్ లైన్ లైబ్రరీ ల్లో ఇది ఉపలబ్ధమే.
Deleteశ్యామలీయం గారు!
Delete’తెలగలు’(ఈ పేరుతో ఇప్పటికీ తెలంగాణలో ఒక కులం ఉంది) దక్షిణ ప్రాంతంలో స్థానికులు అని; ’ఆంధ్రులు” ఆర్యుల బానిసలుగా ఉండి, వారు పెట్టే బాధలకు తట్టుకోలేక, ఉత్తర భారతదేశం నుండి దక్షిణ ప్రాంతానికి వలస వచ్చారని ’ఏటుకూరి బలరామమూర్తి’ గారు రచించిన "ఆంధ్రుల చరిత్ర" అన్న గ్రంథంలో కూడ వివరించబడింది. అందుకు సాక్ష్యంగా కంసుని వద్ద మల్ల వస్తాదుగా ఉండి, అతని పురమాయింపుపై శ్రీకృష్ణునితో యుద్ధం చేసిన ’చాణూరుడు’ అన్న ఆంధ్రుని ప్రస్తావనను ఆ రచయిత ఆ గ్రంథంలో ఉటంకించబడింది.
’ఏటుకూరి బలరామమూర్తి’ గారు సీమాంధ్రకే చెందిన బహుళ ప్రసిద్ధ రచయిత అని నేను వేరుగా చెప్పనక్కర లేదు.
Nizam kalam lo enni schools vunnai and akshrasyata enta ??
ReplyDeleteafter merging to andhra what is the progress/growth rate?
నిజాం కాలంలో ఇన్ని తెలుగు పత్రికలు వెలువడడం గొప్ప విషయమే!ఇప్పటికీ ఒక పత్రిక నడపడమంటే కత్తి మీద సాము చేయడమే!సాహిత్య ప్రసూన అను పేర ఒక మాస పత్రిక జనవరి ౨౦౧౪ నుంచి వస్తుంది!దానికి నేను గౌరవ సంపాదకుడను!డిక్లరేషన్ కూడా ప్రచురణకర్త మేక రామస్వామి గారు తీసుకున్నారు!నేను అమెరికా నుండి ఇండియా వెళ్ళగానే రచనలను ఆహ్వానిస్తాము!
ReplyDeleteనిజమే పత్రిక నడపడం మామూలు విషయం కాదు. సాహిత్య ప్రసూన పేరు చాలా బాగుంది. పదికాలాల పాటు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
Delete