Wednesday, 18 September 2013

తెలుగుభాషకు పుట్టిల్లు తెలంగాణా


నాదీ అని తెలంగాణా వాడు సగర్వపడే భాష తెలుగుభాష
పరాయివాళ్ళు సహితం తమదంటూ గుండెల్లో దాచుకున్న భాష తెలుగుభాష
ఎందరో వలసవాదులొచ్చారు ఆక్రమించి ఆంక్షలు పెట్టారు - తెలుగుభాష స్వరూపాన్నే మార్చారు
రాజులై కొందరు తెలుగు భాషను శతాబ్దాల పాటు అణగదొక్కారు
మరికొందరు తమలో కలుపుకుంటూ తెలుగు భాషకు తెగులు పట్టించారు 
ఇంకొందరు తెలుగుభాష మూలాలనే మార్చ ప్రయత్నించారు

అపర రుద్రులై కాకతీయ రాజులోచ్చారు - తెలంగాణా వీరత్వాన్ని దశదిశల వ్యాపింప జేస్తూ
తెలుగుభాషకు పట్టంకట్టి ఎవరూ అందుకోలేని ఆకాశ హర్మ్యాల తాకించారు తెలుగుభాషను 
వారి ఏలుబడిలో పుట్టిన ప్రతి తెలంగాణా బిడ్డ ఓం నమఃశివాయ అంటూ తెలుగు ఓనమాలు దిద్దాడు
ఒకరా ఇద్దరా లెక్కకు మిక్కిలి కవిరాజులు తెలంగాణలో పుట్టుకొచ్చారు 
కుప్పలు తెప్పలై తెలుగు మహా కావ్యాలు వెలువడి తేజరిల్లాయి 
నాటి కావ్యాలే నేటి తరాలకు ఆనాటి తెలంగాణా సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబించే మూలాధారాలై నిలిచాయి


రాను రాను తెలుగుభాష రూపాంతరం చెందింది  - పరభాషల కలయికతో నాటి తీయదనాన్ని కోల్పోయింది
ఎవ్వరెన్ని చేసినా, ఏమి చేసినా తెలంగాణావాడు తప్పుబట్టలే -ఎదురుచెప్పలే
ఎందుకంటే
పరాయి వలస వాదుల పాలనలోనే శతాబ్దాలు గడిపాడు
వాడిది నిస్సాహాయ స్థితి - ఇది నాదీ అని చెప్పుకునే ధైర్యం కూడా చేయాలనీ దైన్య స్థితి
బానిస బతుకుల్లోనే బతుకంతా గడించింది
తరాలు మారినా తెలంగాణా వోడి నోట తరతరాల తెలుగు తేనెలొలుకుతునే ఉంది 
నేటికీ చెక్కు చెదరక తెలంగాణా ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉంది తెలుగుభాష

*  *  *

విచిత్రమో, విధి వైపరీత్యమో లేక వారి పైత్యమో కాని స్వచ్చమైన తెలుగు పలికే తెలంగాణా వాడి మాటలను
అనాగరికపు మాటలని, సభ్యతలేని మాటలని హేళన చేసే
వాడి అజ్ఞానానికి జాలిపడటం కంటే తెలంగాణా వాడేమీ అనలేడు
నిర్భలుడై,  అసహాయుడై సంఘజీవిగా మనుగడ సాగించుట కొరకు
నలుగురితో బాటు నారాయణ అంటూ, నలుగురిలో వారినే అనుసరిస్తూ
తనవారితో తన తేట తెలుగును పంచుకుంటున్నాడు.

తెలంగాణా వారు తమ మాటల్లో నిత్యం ఉపయిగించే అచ్చ తెలుగు పదాలను (సభ్యతగా లేవని హేళన చేయబడు పదాలు )-
వాటిని తోసి పుచ్చుతూ ప్రస్తుతం వాడబడుతున్నపదాలను కొన్నిటిని ఇక్కడ ఉంచుతున్నాను.

తెలుగు పదాలు - తెలుగు కాక  ప్రస్తుతం వాడుకలో ఉన్న సంస్కృతాది  పదాలు
అంగడి - బజారు
అమాస - అమావాస్య 
అయ్యా - ఆర్యా (సారు)
అరుగు(అరగు)  - వేదిక 
ఆత్రం - ఆత్రుత
ఆరతి - హారతి (నీరాజణం)
ఆస - ఆశ
ఆసర  - ఆశ్రయం
ఇంగలం - అగ్ని(అగ్గి)

ఈను, కాన్పు, నీల్ళాడు   - ప్రసవం
ఉత్తగ - పుణ్యం

ఎడ్దోడు - మూర్ఖుడు
ఎర్క - జ్ఞాపకం
ఏఱు - నది 
ఏర్పాటు - విభజన
ఒప్పుకొను - అంగీకారం
ఓకర, కక్కు - వాంతి 
ఓడు - పరాజయం
ఓపు - సహనం
ఔ - సత్యం (నిజం)
కడుగు - శుబ్రమ్ చేయు
కనికరం - కరుణ (దయ)
కప్పురము - కర్పూరము
కసుగందు - శిశువు
కాక - జ్వరం
కావలి - రక్షణ
కుదువ - గిరివి
కురుపు - వ్రణం (పుండు)
కులుకు - విలాసం
కూడు - అన్నం
కూడ - సహా (ఉదా: వానితో కూడ -వానితో సహా) 
కూయి - ఆర్తనాదం
కూలబడు - విశ్రాంతి
కొంప - గృహం
 గత్తర - ఉపద్రవం
గబ్బు - దుర్గందం
గీటు, గీర - రేఖ
గుడిసె - కుటీరం
గుత్తి - గుచ్చము
గుమ్మం - ద్వారము
గుఱించి - ఉద్దేశించి 
గురుతు - చిహ్నం

గొంగడి - కంబళం 
గోలి - గుళిక
చిట్టి - పత్రిక (పేపర్)
చిన్న నాడు - బాల్యం
చెరచు - నాశనం
చన్ను - స్థనము
 చుప్పనాతి - శూర్పణఖ
జిగట - బంధనం
జిత్తులోడు - మాయలోడు
జీతం - వేతనం
జందెము - యజ్ఞోపవీతం
జబ్బ - భుజం
జాతర - ఉత్సవం
జోగులోడు- భిక్షగాడు
జోడు - సమానం
టెంకాయ - నారికేళం
తక్కెడ - తుల (త్రాసు)
తడవు - ఆలస్యం
తవ్వ - అర్థ సేరు
తాళిబొట్టు - మంగళసూత్రం 
తావు - స్థానం
తిండి - భోజనం
తిక్కలోడు - ఉన్మాది
తిట్లు - శాపనార్ధాలు
తీరిక - అవకాశం
తీవ్రం, దబదబ, డబ్బున - త్వరగా
తూటు - రంద్రము
తెగదెంపు - సమాప్తం
తెరువు - మార్గము
దండుగ - లాభంలేని
దస్తూరి - లిపి
దివాణం - రాజాస్థానం
దొడ్డి - ఆవరణం (పెరడు)
దవ్వు - దూరం
నమ్మిక - విశ్వాసం
నవ్వులాట - పరిహాసం
నిర్రనీలుగు - గర్వము
నెత్తురు - రక్తము
నొప్పి - బాధ
పంచు - విభజించు
పటం - చిత్రము

ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని తెలుగు పదాలు తెలంగాణా వాడి నోటి నుండి నిత్యం జాలువారుతునే ఉంటాయి. తెలుగుభాష అంటూ గొప్పలు చెప్పే వారు అసలైన తెలుగు భాషను ఉపయోగించే తెలంగాణా వారిని హేళన చేయడం అంటే - తెలుగు భాషను హేళన చేయడమనే భావించాలి. 



 
 














15 comments:

  1. I think చుప్పనాతి - శూర్పణఖ is wrong

    ReplyDelete
    Replies
    1. మీరు గ్రహించినట్టు అది ఒక పేరు, కాని మన తెలుగు వాడుకలో ఆమెను ఉదాహరిస్తూ ఒక తిట్టే పదంగా వాడుకలో తెలుగు పదంగా నిలిచిపోయింది. ఇంకా వివరించి చెప్పాలంటే సంస్కృతంలోని వాయుదేవుని తెలుగు వాడకంలో గాలిదేవుడని పిలుచుకున్నట్లు. ఇవి చాలా ప్రాచీన పదాలు. పైన పేర్కొన్న పదాలన్నీ నేను శొదించి పెట్టినవే కాని ఊహతో రాసినవి కావని మనవి.

      Delete
  2. In my view many of the telangana leaders are stating telugu is not their language. may be because there is a party with that name and they have some personal vendetta on that party.. If you list out the words like this, every region in andhra has a big list where other words have dominated their local language. Especially guntur and krishna districts have dominated telugu language as most of lateral literature published from there.

    ReplyDelete
    Replies
    1. The listed above are not local languages (not mandalikam words). They are Purely Telugu Words and note that the other words given are only Sanskrith words.

      Delete
  3. ఈ టపా ముఖ్యోద్దేశ్యం తెలంగాణా వారు వాడే పదాలు సభ్యత కలిగినవే, కాకపోతే అవి అచ్చ తెలుగుపదాలు అని చెప్పటం. చుప్పనాతి అనే పదం తెలంగాణలో బహు వాడకంలో ఉన్న పదం అని ఇక్కడ తీసుకోబడి దానికి సరైన వాడబడుతున్న సంస్కృత పదం తెలుపబడింది.

    ReplyDelete
  4. చాలా మంచి టప. మీ ప్రయత్నానికి చాలా సంతోషం.

    'కూలబడు' అనే దానికి 'విశ్రాంతి' అనే కాకుండా 'అశక్తతతో పడిపోవటం' అను అర్థం కూడా వస్తుంది. ఉదా: ఆ మాట వినగానే కూలబడి పోయింది
    'ఏర్పాటు' కు 'విభజన' అను అర్థం కాదనుకుంటా?
    'జోడు' అంటే 'సమానం' అనే కాకుండా 'తోడూ' కూడా వస్తుంది కదండీ. ఉదా: మీ తోటి కోడళ్ళ జోడు మంచిగుంది.

    ReplyDelete
    Replies
    1. మీరన్నట్టు ఆ అర్థం కూడా వస్తుంది, నేనేమో ఇక్కడ 'చాత కానప్పుడు ఒక దెగ్గర కూలబడాలి" అనే అర్థంలో తీసుకోవటం జరిగింది. ఏర్పాటు (వేరుపాటు) అన్నది సరైనదే - ఒక ఇంట్లో వేరు కాపురాలు పెట్టుకుంటే వాళ్ళు ఏర్పడ్డరు అని అంటాం. ఇంక జోడుకు వాడిన సమానం సంస్కృత పదం. పైన వివరించబడ్డ తెలుగు పదాలన్నింటికీ ఇవ్వబడ్డవి తెలుగు కానివి (సంస్కృత పదాలు).

      Delete
    2. 'ఏర్పాటు(వేరుపాటు)' అనే దానిని 'యేరు పడ్డరు' అన్నట్లు పలుకుతాము మేము. ఇప్పుడు అర్థం అయ్యింది, ధన్యవాదాలు.

      Delete
  5. ఇంగలం, చిట్టి లాంటి ఒకటి రెండు తప్పించి మిగతావన్నీ మేమూ (గుంటూరు జిల్లా) మాట్టాడేవే!

    ReplyDelete
    Replies
    1. మరి సంస్కృత పదాలు చేర్పు ఎవరి చలువో? పైన చెప్పిన పదాలు ఉపయోగిస్తే సంస్కార హీనుడంటున్న దేవరో? ఏదో సామెత చెప్పినట్టే ఉంది మీ వ్యాఖ్య. పత్రికలు, ప్రచురణ, సినిమా, దృశ్య రంగం అన్నీ ఆంధ్రుల చేతిలోనే ఉండి శాసించింది వాస్తవం కాదా?

      Delete
    2. "పైన చెప్పిన పదాలు ఉపయోగిస్తే సంస్కార హీనుడంటున్న దేవరో?" - ఎవరంటున్నారో నాకు తెలవదు గానీండి, అలా అన్నవారు సంస్కారవంతులని నేను భావించను. నామటుకు నేను తెలుగు భాషను - అది ఏ మాండలికమైనా - ఎగతాళి చెయ్యలేదెప్పుడూ. చెయ్యను కూడా. అలా చెయ్యడం తప్పుగా భావిస్తాను. ఒకవేళ నేను గనక అలాంటి తప్పే చేసి ఉంటే అది తెలియక జరిగినదయ్యుండాలి. అయినా సరే, ఆ తప్పుగ్గాను బేషరతుగా క్షమాపణ చెబుతాను. మరోసారి చెబుతున్నాను.. ఈ పదాలు చాలావరకూ మేమూ మాట్టాడేవే!

      ఇక మీ వ్యాఖ్యలోని మిగతా భాగం గురించి.. మీకో నమస్కారం పెట్టి తప్పుకుంటాను.

      Delete
  6. టపాలో కొన్ని పర్యాయ పదాలూ పెట్టడం వల్ల టపా ఉద్దేశ్యం సరిగా అర్థం కాక పోతున్నందున, అట్టి పర్యాయ పదాలు తొలగించి కేవలం తెలుగు కాని సంస్కృత పదాలే ఉంచి టపాను సరిదిద్దడం జరిగిందని మనవి.

    ReplyDelete
  7. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. డైరెక్ట్ గా లింక్ పెట్టటం వల్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. తెలియక చాలా మంది పెడుతూ ఉంటారు. ఎవరైనా ఈ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మీ డైరెక్ట్ లింక్ ని తీసివేసి దాని బదులు మీ టపా URL ని పెట్టుకోవచ్చు.

      Delete


    2. >>> అక్షరసత్యాల తొందరపాటులో అసత్యాలు



      అక్కడ అసత్యాలు ఏమి వెలికి తీసారో అర్థం కాదు దాదాపుగా నేను చెప్పిన తెలుగు పదాలు తెలుగు పదాలుగానే, సంస్కృత పదాలు సంస్కృత పదాలుగానే ప్రస్తావించటం జరిగింది.



      నేను ప్రస్తావించినవి వాడుకలోని ఉచ్చారణ పదాలు మాత్రమే.



      కాగా మీరు సరైన అచ్చ తెనుగు పదాలు - సరైన సంస్కృత పదాలు అని వివరించటం అసంగతం. వాడుకలో ఆ పదాలు కొంత మార్పుకు గురవటం సహజం - కాని అవి తెనుగు, సంస్కృత పదాలన్నవి సత్యం అన్నపుడు అక్కడ అసత్యాలెమిటో అర్థం కాని విషయం.

      Delete