Sunday, 22 September 2013

తెలంగాణుల చరిత్ర ఆవశ్యకత


తెలంగాణుల చరిత్ర

కొత్తగా తెలంగాణుల చరిత్ర ఏమిటి అనుకోవచ్చు!
తెలంగాణా ఒక ప్రాంతం అయితే వారికేమిటి కొత్తగా చరిత్ర అనవచ్చు!
చాలా చరిత్రలుండగా ఈ కొత్త చరిత్ర ఏమి అని అడగవచ్చు
ఎన్ని చరిత్రలున్నా వాటిలో తెలంగాణుల చరిత్ర సున్న
ఎన్ని పుస్తకాలు వెతికినా ఎన్ని పేజీలు తిరగేసినా
తెలంగాణుల చరిత్ర శూన్య గోచరం
తెలంగాణా చరిత్ర ఒక ప్రత్యేకమని సందేహం లేవనెత్తినా
అది కేవలం సందేహమనే కొట్టిపారేస్తారు

తెలంగాణా వారికి ప్రత్యేక చరిత్ర లేక కాదు ఉంది
అది వెలుగులోకి రాకపోవటానికీ సవా లక్ష కారణాలున్నాయి
మూలాలు శోదించక పోవడం ముఖ్య కారణమైతే 
శతాబ్దాల తరబడి స్వతంత్రత లేక పోవడం మరో కారణం
తెలిసినా, సందేహించినా సాహసించి ఏకాకి కావటం ఇష్టపడక రాయక పోవడం ఇంకో కారణం

అయితే ఈ బలహీనతలే ఆయుధంగా చేసుకుని  
తెలంగాణా వాడికి చరిత్రలేదంటారు - చరిత్రే తెలియని చరిత్ర హీనులు 
తాము రాసిందే శిలా శాసనం అనుకుంటారు కూపస్థ మాండూక అందకారులు
అదే నీ చరిత్ర - అదే నీ గతజీవితం అంటూ అసత్యాలు రాసి శాసిస్తారు 
 అమాయకులైన తెలంగాణా వారిని అభాసు పాల్జేసి ఆనందిస్తారు

తెలంగాణుల చరిత్ర సరైన పదమే 
తెలంగాణుల చరిత్ర అనే పదం కొత్తగా అనిపించినా అదే సరైనది
నిజానికి తెలంగాణా ప్రాంతపు జాతిని ప్రాచీనకాలం నుండి తెనుగు, తెలుగు, తెలింగ్, తెలంగ్ అన్నారు
రాను రాను ఆ పదం తెలంగులు, తెనగాన్యులు, తెలంగాన్యులు, తెలంగాణులు
అంటూ రూపాంతరం చెందుతూ వచ్చింది.
ఒక్కో చోట ఒక్కో విధంగా సంభోదించబడ్డా మూలం ఒక్కటే
నిజానికి తెలుగుజాతి చరిత్ర అని చెప్పాల్సి ఉంటుంది 
కాని ఆ జాతి పదం కాస్తా భాషా జాతిగా వాడుకలో తేబడింది
ప్రస్తుత కాలంలో తెలంగాణా పేరుతోనే తెలంగాణా వారు ప్రత్యేకంగా పిలువ బడుతున్నందున
తెలంగాణుల చరిత్ర అనటమే సరైనది. 

తెలంగాణా లో ఉన్నవారు 95% తెలంగాణా వారే 
తెలంగాణాలో ప్రస్తుతం ఉన్నవారంతా తెలంగాణా జాతి వారే అని చెప్పలేం
కాని ఒక్క హైదరాబాదు మినహాయించి నూటికి  95% తెలంగాణా జాతి వారే అన్నది సత్యం.
తెలంగాణా వారు ఎన్నో ప్రాంతాల వెళ్ళారు
కాని వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారు 95%  హైదరాబాదు ప్రాంతానికే వలస వచ్చారని చెప్పవచ్చు
మిగతా జిల్లాల్లోకి వలస వచ్చిన వారు 5% కూడా ఉండరు.
అయినా హైదరాబాదును  పక్కన బెడితే జిల్లాలలోకి వలస వచ్చిన వారు తెలంగాణా సంస్కృతిలో మమేకమై తెలంగాణా వారైపోవటం విశేషం. 

తెలంగాణుల చరిత్ర ఆవశ్యకత
తెలంగాణా జాతి వారికి ఒక ప్రత్యేక చరిత్రంటూ ఉండక పోవటం వల్ల అన్యులుగా చెలామణి అయ్యే ఆవశ్యకత ఏర్పడింది
అసత్య చరిత్రల్లొ కలిసిపోయి తమ ప్రత్యేకతను కోల్పోబడుతుంది 
తెలంగాణా ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయి
అసలైన తెలంగాణా తెలుగు భాష అపహాస్యం పాలవుతోంది

తెలంగాణా చరిత్ర భావి తరాలకు అందింప బడలేకుండ పోతుంది

అణగదొక్కబడిన చరిత్ర ఒక్క సారిగా ఉవ్వెత్తున లేస్తే
తెలంగాణావాడిపై రాసిన అసత్యాలన్నీదూది పింజల్లా గాలికి కొట్టుకు పోతాయి
ఆ ఘడియ ముందు ముందు వస్తుందనే నేను భావిస్తున్నాను
అది కష్ట సాధ్యమనిపించినా కష్టపడితే సాధ్యమే
ఎక్కడ అణచి వేయబడ్డదో  అక్కడే మూలాలు దొరుకుతాయన్న సత్యం గ్రహిస్తే సరి 
అంతవరకూ నాకు తెలిసిన సత్యాలనే ఈ టపాలో పెడుతుంటాను

1 comment:

  1. మంచి ప్రయత్నం, తదుపరి టపాలకోసం ఎదురు చూస్తుంటాను

    ReplyDelete