Saturday 15 November 2014

తెలంగాణ కీర్తికిరీటం-నిజామియా నక్షత్రశాల

Nizamia Observatory


ఒకప్పుడు ప్రపంచంలోనే అతి ప్రధానమైనది ఈ నిజామియా నక్షత్రశాల. అంతరిక్షంలోని గ్రహాల, నక్షత్రాల అధ్యయనమే కాక, ప్రతిరోజూ వాతావరణ పరిస్థితుల అధ్యయనాలను కూడా చేసేది. అప్పట్లో గొప్ప ఖగోళ పరిశోధనా కేంద్రంగా ఇది పేరు పొందింది. ఈ అబ్జర్వేటరీ తొలిసారి 2,63,000 నక్షత్రాల అధ్యయనం చేసి ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలిచింది.  

ఈ నక్షత్రశాల 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ హయాంలో నాటి నిజాం రాజ్యపు మంత్రి నవాబ్ జఫర్ జంగ్ చే ఫిసల్ బండ లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనిని "రసద్గాహ్ నిజామియా" (Rasadgah Nizamia) అని పిలిచేవారు. మదరాసు లో బ్రిటీష్ వారి అబ్జర్వేటరీ తప్ప అప్పటికీ భారతదేశంలో మరో అబ్జర్వేటరీ లేదు. వాతావరణ పరిస్థితుల అధ్యయనం కూడా తెలిసేది కాదు.  1908 ప్రాంతం నుండి ఇది పనిచేయటం ప్రారంబించింది. హైదరాబాద్ అక్షాంశ రేఖాంశలను తొలిసారిగా సరిగ్గా పరిశోధించి స్థిరపరిచింది ఈ నక్షత్ర శాలయే. జఫర్ జంగ్ మరణం తరువాత ఈ అబ్జర్వేటరీని నిజాం ప్రభుత్వం అమీర్ పేట దగ్గరలో బేగంపేటకు తరలించింది. అక్కడ ఇది చాలా కాలంపాటు పరిశోధనలు చేసింది. ప్రతిరోజూ వాతావరణ పరిస్థితులు గ్రహించి ప్రకటించేవారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం ఖగోళశాస్త్ర విభాగానికి 1918 లో అనుబంధంగా చేయబడి అంతరిక్షపరిశోధక విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపకరించింది. 1928 లో ప్రపంచ అంతరిక్ష సంస్థ వారికి చెందినా ప్రాజెక్ట్ ను నిజాం నక్షత్రశాల వారు నెరవేర్చటం గొప్ప విశేషం. తరువాత 1929లో ఇక్కడ అబ్జర్వేటరీకి బలూన్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజూ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయటం జరిగింది.  


అయితే బేగంపేట ప్రాంతం ఎత్తైన భవనాలు ఏర్పడి పరిశోధనకు అవరోధంగా ఉండటంతో 1968 లో ఈ అబ్జర్వేటరీని హైదరాబాద్ నుండి నాగార్జునసాగర్ వెళ్ళే దారిలో ఇబ్రహీంపట్నం దేగ్గరలో గల  జాపాల్ రంగాపూర్ గ్రామాల మధ్యకి మార్చటం జరిగింది. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 615 మీటర్ల ఎత్తున ఉండి పరిశోధనలకు అనుకూలంగా ఉండటంతో, అదీకాక జనావాసాలకు దూరంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎన్నోకోవటం జరిగింది.   ఇప్పుడు దీనిని జాపాల్-రంగాపూర్ అబ్జర్వేటరీ అని పిలుస్తున్నారు. అయితే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ నక్షత్రశాల ఎవరికీ తెలియకుండా ఆదరణ కరువై వెలుగులులోకి రాకుండా పోయింది. 

నిజాం అబ్జర్వేటరీతో బాటు జపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీకి సంబందించి విశేషాలు తెలిపే వీడియో:






1980 ఇండియాలో వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని జాపాల్-రంగాపూర్ అబ్జర్వేటరీ నుండే అధ్యయనం చేశారు. వాటికి సంబందించిన ఫోటోలు ఇక్కడ చూడగలరు:
http://web.williams.edu/Astronomy/eclipse/eclipse1980/index.html

కాగా బేగంపేటలో ఇప్పటికీ అలనాటి అబ్జర్వేటరీలు ఆలనా పాలనా లేక శిథిలావస్థలో ఉన్నాయి. ఆ స్థలంలో ఇప్పుడు సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అనే సంస్థ నడుస్తుంది.

నిజాం అబ్జర్వేటరీతో బాటు బేగంపేట అబ్జర్వేటరీ కి సంబందించిన విశేషాలు తెలిపే వీడియో:




బేగంపేట నిజాం అబ్జర్వేటరీకి సంబందించిన మరికొన్ని విషయాలు, అరుదైన చిత్రాలు ఈ క్రింది లింక్ లో చూడవచ్చు:
http://www.inditales.com/2012/01/hyderabad-hues-xiii-nizamia-observatory.html



మరికొంత సమాచారమై నిజాం అబ్జర్వేటరీ పనితీరు గురించి 1942 హైదరాబాదు సమాచారం లో ప్రచురించబడిన వ్యాసం ఇక్కడ ఉంచుతున్నాను. 








No comments:

Post a Comment