ఇలాంటి వాళ్ళకి ఉరిశిక్ష పడేలా చూడాలి
ఒకరుకాదు ఇద్దరుకాదు ఎంతోమందితో ఈ విధంగానే ప్రవర్తించారు వీరు. మానవ రూపాల్లో ఉన్న మృగాలు వీరు. ఇలాంటి వాళ్ళని ఒదిలేస్తే సమాజానికే కాదు దేశానికే ప్రమాదం. రాజకీయ పలుకుబడి లేదా ధన బలంతో ఇలాంటి వాళ్ళు మన దేశంలో చట్టం నుండి తప్పించుకుని దర్జాగా తిరుగుతున్నారు. నిర్భయ ఉదంతం తర్వాత నిర్భయ చట్టం తెచ్చినా ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడ్డ దాఖలాలు ఇప్పటికీ లేవు.
ఎక్కడ లోపమో తెలియదుగాని మహిళలపైన అత్యాచారాలు తగ్గడం అటుంచి రోజురోజుకూ మనదేశంలో ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా సామూహిక అత్యాచారం అనే పదం ఈ మద్యన తరచూ వినాల్సి వస్తుంది.
ముఖ్యంగా పాలకుల ఉదాసీనత, నేరస్థులకు సపోర్ట్ చేసే నేతల మాటల వల్ల అయితేనేమీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహిళలకు రక్షణలేని రాష్ట్రంగా పేరుపడిపోయింది.
హైదరాబాద్ ప్రధానంగా IT సిటీ, ఇక్కడ మహిళలు అర్థరాత్రి కూడా ఉద్యోగానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ళని బయటకు ఒదిలేస్తే హైదరాబాదు నగరానికే ప్రమాదం. తెలంగాణా నూతన ప్రభుత్వం ఇలాంటి వాళ్ళను వదిలిపెట్టే వీలులేకుండా చేసి చట్టం ద్వారా కఠినశిక్ష పడేలా చేయాలి. అప్పుడే హైదరాబాద్ సేఫ్ సిటీగా మనగలిగి ఇంకా అభివృద్ధిలో పయనించ గలుగుతుంది.
నమస్తే తెలంగాణా వారికి ధన్యవాదములతో
నమస్తే తెలంగాణా 23-8-2014
No comments:
Post a Comment