Sunday 17 August 2014

తెలంగాణ తేజం - ఆర్యభట్ట

తెలంగాణ తేజం - ఆర్యభట్ట



గణిత శాస్త్రంలో ఆర్యభట్టకు (ఆర్యభట్టు లేదా ఆర్యభట్)  ఉన్న విశిష్టత ఎవరికీ తెలియంది కాదు, ప్రపంచంలోనే గొప్ప గణిత శాత్రవేత్తల్లో అగ్రగణ్యునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గణిత, ఖగోళ శాస్త్రాలకు సంబంధించి ఎన్నో రచనలు చేశాడు ఆర్యభట్ట. 

క్రీ.శ. 426 లో అస్మక రాజ్యంలో ఆర్యభట్టు జననం జరిగినట్టు చరిత్రకారులు, చారిత్రిక అధారాలనుబట్టి చెబుతున్నారు. ఆయన జన్మస్థానం తరెనగ (Tarenaga) గా చెప్పబడింది. ఆర్యభట్ట శిష్యుడే ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త భాస్కరుడు-1. ఈయన తన గురువు ఆర్యభట్ట గురించి రాస్తూ, ఆర్యభట్ట అస్మక (అస్సక) దేశంలో జన్మించాడని రాయటం జరిగింది. 

గుప్తుల కాలంలో అస్మక అనేది 16 మహాజనపదాల్లో ఒకటి. అస్మక రాజ్యం గోదావరి- మంజీరా నదుల ప్రాంతాల్లో విలసిల్లింది (కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు, మెదకు మరియు నేటి మహారాష్ట్రలో కలిసిపోయిన నాందేడ్ ప్రాంతాలు). అస్మక రాజధాని కరీంనగర్ లోని కోటిలింగాలగా చెబుతారు. మరికొందరు బహుధాన్యపుర (నేటి బోధన్) గా భావిస్తారు. ఈ అస్మక జానపదం గురించి మత్స్య పురాణంలో విశేషంగా చర్చించబడింది. ఈ అస్మక రాజ్యాన్ని 24 మంది రాజులు పాలించినట్లుగా చెప్పబడింది. 

విద్యను అభ్యసించటానికి ఆర్యభట్ట కుసుమపుర/పాటలీపుత్ర (నేటి పాట్నా) లోని నలందా విశ్వ విద్యాలయానికి వెళ్ళినట్టుగా చరిత్ర వలన తెలుస్తుంది. అక్కడ విద్యను అభ్యసించడంతో బాటు ఖగోళ శాస్త్ర పరిశోధనలూ జరిపాడు. తన 23 వ ఏటనే ఆర్యభట్టీయ, ఆర్యసిద్దాంత గ్రంధాలను రాశాడు (నిజానికి వాటికి ఆర్యభట్ట ఏ పేరు పెట్టలేదు, గణితపద, గోళపద, కాలక్రియపద, గీతికపద లాంటి ఎన్నో రచనలు రాశాడు - తరువాత శాస్త్రజ్ఞులు ఆయన సిద్దాంతాలకు పేరు ఇవ్వటం జరిగింది). గణితంలో ఎన్నో విశేషాలకు ఆద్యుడయ్యాడు - అవి చాలా ఉన్నాయి. ఆర్యభట్ట క్రీ.శ.550 లో పరమపదించిటం జరిగింది. 

ప్రపంచం మొత్తం ఆర్యభట్ట గొప్ప గణిత, ఖగోళ శాస్త్రవేత్తగా గుర్తించింది. భారత ప్రభుత్వం తమ తొలి అంతరిక్ష నౌకకు ఆర్యభట్ట అని నామకరణం చేయటం జరిగింది. 

ఆర్యభట్ట తెలంగాణా ప్రాంతపు వాడు కావడం తెలంగాణ వారు గర్వించదగ్గ విషయం. ఎంతో ఘన చరిత్ర కలిగిన తెలంగాణా ప్రాంతం వివక్షతకు గురై ఉనికిని కోల్పోవటం జరిగింది. నిజాం ప్రభుత్వ హయాంలో కొన్ని చరిత్ర పరిశోధనలు జరిగాయి. కొండాపూర్, కోటి లింగాల వంటి అతి ప్రాచీన ప్రాంతాలు గుర్తించటం జరిగింది. ఆంధ్ర ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత అవి వెలుగుకు నోచుకోక పోవటమే కాకుండా ఎంతో ప్రాచీన వస్తువులు తెలంగాణా నుండి తరలించి వేయబడ్డాయి. అణచి వేయబడ్డ తెలంగాణా విశిష్టతను, ప్రాచీనతను వెలుగులోకి తేవలసిన భాద్యత కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. 


  



4 comments:

  1. >ఆర్యభట్ట తెలంగాణా ప్రాంతపు వాడు కావడం తెలంగాణ వారు గర్వించదగ్గ విషయం
    బాగుంది. అప్పట్లో తెలంగాణా అన్న పదం ఒకటి వ్యవహారంలో ఉందా అసలు?

    ReplyDelete
    Replies
    1. కాలాలతో బాటు ప్రదేశాల పేర్లలో మార్పులు వస్తుంటాయి - కాని ప్రదేశాలు అలానే ఉంటాయి. అలా చెప్పుకుంటు పోతే నేడు ఇండియాగా పిలవబడుతున్న మన దేశం పూర్వంలో ఎన్నో పేర్లతో పిలవబడింది. భారతదేశం, హిందూస్తాన్, హిందూ దేశం, ఆర్యావర్తం, సింధు ఇలా చాలా పేర్లే ఉన్నాయి. ఆయాకాలాల్లో మన భారతభూమి పై పుట్టినవారు మనవారుగానే గొప్పగా చెప్పుకోవటం లేదా? చాలా వింతగా ఉంది మీ ప్రశ్న.

      Delete
  2. Prasththam ekkado vunna asmaka raajyam lo puttina Arya bhattu manavade.....sabhaash.
    kani..
    ekkado putti prasthutha telaganulani thapuudova pattisthunna k c r ?

    ReplyDelete
    Replies
    1. KCR తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగినవాడు. ఆయనే కాదు వారి పూర్వికులు కూడా తెలంగాణా ప్రాతం వారే. ఆ విషయాలు నా పాత టపాలో చూడవచ్చ. ఇన్నాళ్ళు తెలంగాణలో ఉండి ఆంధ్రాకు వెళ్ళిపోతున్న నాయకులు ఆంధ్రావాళ్ళు కాదని వాదించ గలవా?

      Delete