Friday, 13 June 2014

మార్చండి మన చట్టాలు

మార్చండి మన చట్టాలు 


ప్రతినిత్యం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనుషులు మనుషుల్లానే ప్రవర్తిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. గత 20 రోజుల్లోనే ఒక్క UP లోనే నలుగురు అమ్మాయిలను అత్యాచారం చేసి చెట్టుకి ఉరితీశారు. ఈ 3 ఉరితీత సంఘటనలే కాక మరెన్నో అత్యాచారం ఆపై హత్య సంఘటనలు అటు UP లోనే కాక దేశం మొత్తం మీదా లెక్కకు లేనన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇలా చేసేవారికి సరైన శిక్షలు పడితే మరొకరు చేయడానికి సాహసించరు. 


చట్టాలయితే ఉన్నాయి కాని వాటిని తప్పించుకునే ఉపాయాలు, లోపాలు మరెన్నో ఉన్నాయి. డిల్లీ సంఘటన తరువాత పక్కా చట్టం అంటూ నిర్భయ చట్టం తెచ్చారు. కాని ఆ చట్టం ప్రకారం ఇంతవరకూ ఎవరికీ శిక్షలు పడ్డాయో తెలియదు. అంతెందుకు ఆ నిర్భయ కేసులోనే ఇంకా న్యాయం జరగనే లేదు. కేసు ఒక కోర్టు నుండి ఇంకో కోర్టుకు మారిపోతోంది. వాదించము అన్న న్యాయవాదులే ముందుకు వచ్చి దోషుల తరపున శిక్ష పడకుండా వాదిస్తున్నారు. దోషులకు ఇంకా ఎన్ని సంవత్సరాల తరువాత శిక్ష అనుభావిస్తారో కూడా తెలియని పరిస్థితి. 


ఈ సంఘటనలే కాక ఉగ్రవాద సంఘటనల్లోనూ అదే పరిస్థితి. వందలమందిని బలిగొన్న ఒక ఉగ్రవాదిని శిక్షించటానికి దశాబ్దాలు పడుతోంది. ఇప్పటికీ ఎంతోమంది ఉగ్రవాదులు జైళ్లలో ఇంపార్టెంట్ ఖైదీలుగా బాగా తిని బలుస్తూ హాయిగా బతికేస్తున్నారు, సమయం దొరికితే మసూద్ అజర్ లా తప్పించుకు పారిపోతున్నారు. ఉదాసీనత వలన దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు మహారాజులై వెలిగిపోతున్నారు. అందుకే నానాటికీ ఉగ్రవాదం పెరిగిపోతోంది.  


కొత్త ప్రభుత్వం కూడా ఈ విషయాల్లో ఇంకా ఉదాసీనత ప్రదర్శిస్తే రాను రాను పరిస్థితులు మరింత దిగజారటం ఖాయం. పాత బడిపోయిన మన చట్టాలు మార్చండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులంటూ సంవత్సరాలు సాగదీసే పద్దతికి పుల్ స్టాప్ పెట్టి, దోషులను వెంటనే ఖటినంగా శిక్షించే విధంగా చట్టాలు రూపొందించాలి. అప్పుడే సమాజం బాగుపడేది. అప్పుడే మనుషులు మనుషుల్లా ప్రవర్తించేది. 

ఇది జరగాలంటే మొదటగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు వెంటనే ఆమోదం పొందాలి, తద్వారా మహిళలు అధిక సంఖ్యలో అధికారత పొందినపుడే మహిళలకు తగు రక్షణలు రూపిందే అవకాశం ఉండేది. 








No comments:

Post a Comment