Sunday 22 September 2013

శతాబ్దాలు బర్మాను పాలించిన తెలంగాణులు


ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమైనా ఇది పరమ సత్యం

క్రీ.పూ. 300 నాటికే తెలంగాణాలో విలసిల్లిన నాగరికత 

తెలంగాణావారు క్రీ.పూ. 300 సంవత్సరాల క్రితమే ఇక్కడ తెలంగాణాలో పూర్తిగా నాగరికులై ఉన్నారని
ఇక్కడ వారి నాగరికతను తెలంగాణా ప్రాంతం నుండి కొంతమంది తెలంగాణులు క్రీ.పూ. 1 వ శతాబ్దంలో బర్మాకు తీసుకు వెళ్ళారని చరిత్రను బట్టి తెలుస్తుంది.
వారితో బాటు ఇక్కడి వారికి సంబందించిన బుద్ధ విగ్రహాలతో సహా సమస్త వస్తువులను సముద్ర మార్గం గుండా తీసుకెళ్లారని తెలియబడుతుంది.
వీరు పలు గ్రంధాలను, కళలను సంస్కృతిని, ధర్మాన్ని, నాగరికతను అక్కడి ప్రజలకు అందజేశారని
అది అక్కడి ప్రజల అభివృద్దికి ముందు బాట వేసిందని తెలియబడుతుంది. 
అక్కడి శాసనాలు వీటిని దృవపరుస్తున్నాయి.
తైలింగ్ శాసనాలు ప్రాచీన తెలుగుకు దగ్గరగా ఉన్నాయి.
---------

పై వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి:
http://en.wikipedia.org/wiki/Migration_period_of_ancient_Burma  పేజీలో
"Earliest Migrants amongst Burmese" పేరా
----------

తెలంగాణా నుండి వెళ్ళిన Talaings (Mons అని కూడా పిలవబడుతున్నారు)
 బర్మాను పాలించిన మొదటి రాజులు
Mon Kingdom సుమారు 250 ఏళ్ళు (825-1057) సాగిందని తెలుస్తుంది
అంతేగాక తలైంగులు తరువాతి కాలంలోనూ రాజులుగా కొనసాగినట్లు కనబడుతున్నది.
వీరి రాచరికపు పరిపాలన గురించి కూడా ఎంతో కొనియాడబడింది చరిత్రలో 
తలైంగులు ఎంతోమంది ఇప్పటికీ అక్కడ జీవనం సాగిస్తున్నారు.

G.E.Harvey రాసిన "History of Burma"
Talaings నుండి మనకు తెలంగాణా ప్రాచీన చరిత్ర చాలా వరకు తెలియబడుతున్నది
6 వ పేజీ లో తలైంగులు తెలంగాణా నుండి బర్మా వెళ్ళినట్లు స్పష్టంగా తెలుప బడింది
అంతే కాక తలైంగుల గురించి అందులో చాలా వివరించబడింది. 
నాగ జాతికి చెందిన వీరు నాగులను పూజిస్తారు కాని చంపరని తెలపబడింది. దీన్ని బట్టి తెలంగాణా వారు దక్షిణా పథంలో నాగరిక జీవనం సాగించిన నాగ జాతికి చెందినవారుగా భావించ బడుతుంది.
నాగ జాతి జీవన విధానం కూడా తెలంగాణా జీవన విధానానికి దగ్గరగా కనిపిస్తుంది.
ఇది తరువాత చర్చించ వలసిన విషయం.

R.Halliday రాసిన "The Talaings"
పుస్తకం నుండి బర్మా తలైంగుల జీవన విధానం తెలంగానులను పోలి ఉన్నట్టు విశదపరుస్తుంది.
వారి పనివిధానపు ఫోటోలు తెలంగాణా జీవనంను తలపిస్తున్నాయి. 

తైలింగుల గురించిన క్రింది వార్త మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు రచించిన
"తెనుగు - తోబుట్టువులు" నుండి గ్రహించబడినది, వారికి కృతజ్ఞుడను.
 


ఈ బర్మా తెలంగాణా వారి గురించి మరింత పరిశోధించిన క్రీ.పూ. తెలంగాణా గురించిన విషయాలు చాలా బయటపడే అవకాశాలు కలవు.
ఇది ప్రాచీన తెలంగాణాకు సంబందించిన అతి ముఖ్య సమాచారంగా/ఆధారంగా భావించవచ్చు.


10 comments:

  1. So Burma should be part of telangana, great

    ReplyDelete
  2. మహాశయా క్రీ.పూ.౩౦౦ కాలంలో ఇప్పుడున్న తెలంగాణా సీమాంధ్ర అనే ప్రాంతాలు ఉండేవా? తెలంగాణా అనే పదాన్ని సృష్టించినప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళనందరినీ ఉద్దేశించే అనేవారా లేదా ఒక్క దక్కను ప్లేటో పరిసరాల్లో నివశించే వారినే అనేవారా? పోనీ వారే బర్మా ప్రయాణం చేసినప్పుడు వారి పడవలు తూర్పు కోస్తా నుండి గాక మరెక్కడి నుండైనా సముద్ర యానం చేసేరేమో?

    ReplyDelete
  3. Continuation or earlier comment.

    Please study the books of Sri Kota Venkatachalam (not modern history books as our history is very controversial up to muslim rule). At the time Satavahanas - Andhra rulers - almost whole India was under their control. So whatever you are referring in this articals Some of telugu rulers occupied (present Burma). Almost all Puranas mentioned Gupta Rulers (Chandra Gupta, Samudra Gupta etcc.) as Andhrabrityas and said that they killed Satavahanas and came to rule.

    ReplyDelete
  4. Anonymous ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి వ్యాఖ్యా రాసేటపుడు పది లైన్స్ మంచి విషయాలు రాసి ఒక్క డర్టీ పదం ఉపయోగించినా అది ఇక్కడ ప్రచురించబడదు, మీకు అంతగా రాసుకోవలనిపిస్తే మీ బ్లాగులో రాసుకోవచ్చు. అలా రాసే వ్యాఖ్యాలు ప్రచురించబడటం లేవు.



    Anonymous ల వ్యాఖ్యాలన్నీ ఒకటే ఉన్నవి. అది తలైంగ్ (తెలంగాణా) పదం అప్పుడు ఉందా అని, అది బర్మా లోని శాసనంలో క్రీ.పూ. లిఖించబడి ఉంది. తలైంగ్, తిలింగ్ అని అప్పటికే పిలవబదిందని ఇప్పుడు చరిత్ర రాసినవారు కాదు క్రీ.శ. 2 శతాబ్ది కాలపు చరిత్ర కారుల రచనల్లో స్పష్టంగా రాయబడి ఉంది - ఆ విషయాలు ముందు టపాల్లో పెట్టబడతాయి.



    తలైంగ్ పదం కేవలం తెలంగాణా ప్రాంతానికే వర్తిస్తుంది.

    తలైంగ్ అనే ప్రాంతం తెలంగాణా కాక మరెక్కడైనా ఉందా ఉంటే చెప్పండి!



    తెలంగాణా ప్రాంతం నుండి సముద్ర మార్గం ద్వారానే వెళ్ళారు. వీరేమీ యుద్దాలు చేస్తూ జయించుతూ వెళ్ళలేదు. బౌద్ధమతం విస్తృత ప్రచారంలో ఉన్న ఆ కాలంలో ప్రచార నిమిత్తమో వలస వెళ్ళి ఉంటారు. అందుకే బౌద్దానికి సంబందించిన వస్తువులు, సాహిత్యం తీసుకు వెళ్ళారు. బౌద్ద ప్రచారం ఆనాడు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలోకి ఇలానే ప్రాకింది. వలస వెళ్లేవారు ఎన్నో రాజ్యాలు దాటుకుంటూనే వెళ్ళారు ఉదా: ఆంధ్రులు ఎక్కడో గంగా నది నుండి కృష్ణా నది వరకు ఎన్నో రాజ్యాలు దాటుతూ వలస వచ్చారని చరిత్రలో చదవలేదా?



    ఇంకా కొందరి Anonymous ల వ్యాఖ్యాలు చూస్తుంటే తెలంగాణా చరిత్ర రాయటం కూడా ఏదో నేరం అనేలా ఉంది.

    ఉన్న చరిత్ర చెబితే అంత ఉలుకెందుకు? అంటే తెలంగాణా చరిత్ర రాసుకోవడం కూడా తప్పేనా? తెలంగాణా చరిత్ర ఏదీ వెలుగు చూడకూడదా? చెపుతున్నది వాస్తవ చరిత్రే కదా? తప్పులు ఉంటె చెప్పండి ప్రచురించి, సమాధానం చెపుతాను. ప్రశ్నలు వేసినపుడే వాటి నిగ్గు తేలేది - కొత్త విషయాలు బయటకు వచ్చేవి.

    ReplyDelete

  5. ఆ కాలంలో,క్రీ.పూ.200 నుంచి క్రీ.శ.2ఊ వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ మాత్రమేగాక దక్షిణా పథమంతా ఆంధ్రశాతవాహన చక్రవర్తులు పరిపాలించారు.అప్పుడు ఆగ్నేయ ఆసియా దేశాలన్నిటితో వర్తకవ్యాపారాలు.అక్కడ వలసరాజ్యస్థాపనలు జరిగినవి.అమరావతి వరి రజధాని. త్రైలింగదేశమని కూడా మరోపేరు.తూర్పుకోస్తా రేవులలోనుంచే వర్తకం, వలసలు జరిగేవి.కేవలం నేటి ''తెలంగాణా 'అనేప్రాంతానికే ఈ క్రెడిట్ దక్కదు. అప్పటికీ ప్రాంతాంతీయ భేదాలు లేవు.ఐనా నేటి పరిస్థితులనుబట్టి నిర్ణయాలు తీసుకోవాలిగాని ఈ పాతచరిత్ర తవ్వడం అనవసరం.

    ReplyDelete
    Replies
    1. పాత చరిత్ర తవ్వడం కాదు పాత చరిత్రలో పాతరేయబడి వెలుగు చూడకుండా పోయిన విషయాలే ఇక్కడ రాస్తున్నాను?

      తెలంగాణాకు ఆ క్రెడిట్ ఆనాడు దక్కకుండా చేశారు - ఇప్పుడు కూడా మీ మాటలే చెబుతున్నాయి.

      అయ్యా! గత చరిత్రను రోజూ తోడుతూనే కదా వేల ఏండ్లు కలిసి ఉన్నాం అంటూ నేడు సీమాంధ్ర లో ఉద్యమాలు చేస్తుంది.

      అయినా నాటి చరిత్ర నిజాలు చెప్పుకోవద్దంటే అన్ని చరిత్ర పుస్తకాలు ఎందుకండీ? మనుషులే కదా రాసింది? దేవుళ్ళు దిగి వచ్చి రాయలేరు కదా వాటిలో తెలపని విషయాలు తెలపవద్దనటానికి?

      ఇంకా నేను ఆంద్ర శాతవాహన రాజుల దెగ్గరకు రాలేదు - ఇంకా మొదలు పెట్టానో లేదో మీ లాంటివారు అడ్డుతగిలితే ఇంకా ముందుకు ఎలా వెళ్ళేది?

      Delete
  6. gwalior, pune, Nagpur, Indore, Baroda were the kingdoms wherein hundreds of TELANGANA families are settled. They migrated to those kingdoms as experts in the areas of Pourohityam, Vedam, Cooking, teaching.

    The surname used by these people is: TELANG, TAILANG, TELANGI...

    At chitnis-ki-goth in Lashkar Gwalior alone, there are 35 telang families

    ReplyDelete
  7. Trilinga Desa is nothing but Andhra. Thrilinga Desa name came from famous Three Shiva temples Sri Kaleswaram, Sri Kalahasti and Draksharamam.

    Earlier days Telangana/tailang/telang refers to all andhra pradesh whose mother tongue is Telugu.

    Example: The popular Yogi - "The walking Shiva of Varanasi" called as Trilinga Swami or Tailang Swami or Telang Swami (birth place Vijayanagam, north Andhra) whom lived around 300 years (nirvana year 1887 AD) stayed in Varanasi. source: http://en.wikipedia.org/wiki/Trailanga_Swami.

    ReplyDelete
  8. తెన్ - South
    ఉఁగలు - Plural Form "S" (Similar words in Kannada గళు, Tamil - గళ్)
    తెనుఁగులు - Southerns = South People
    తెనుఁగు = తెలుఁగు = తెలుంగు = తెనుంగు = తెలింగు = తలైంగు = తలారి (Accent of different people)

    శాతవాహనుల తొలి రాజధాని - కరీంనగర్ జిల్లా, గోదావరి ఒడ్డునుండే "ఆంధ్ర నగరి" (నేటి కోటిలింగాల)
    తర్వాతి రాజధాని - ప్రతిష్టానపురం (మహారాష్ట్ర లోని పైఠాన్)
    చివరి రాజధాని - అమరావతి (గుంటూరు)

    "నడుస్తున్న చరిత్ర"లో బర్మాలో తలైంగు రాజులు అమల, విమల గురించి, మూన్ జాతి వారి జోలపాట గురించి (దానర్థం . కొడుకా.! మన నేల తెలంగాణ. మన రాజు అదృష్టం బాగోక యుద్ధం లో ఓడిపోతే, సువర్ణభూమికి వచ్చాం.. ఇలా ఉంటుంది ) వ్యాసం వచ్చింది.

    సముద్ర మార్గాన , పోయేదానికి "ఇప్పటి తెలంగాణ"కి సముద్రం ఎక్కడుంది. ఉంటే, గింటే ఇప్పటి "ఆంధ్ర" ప్రాంతమే అప్పటి "తెలంగాణ కి చెందిన సముద్రం" అవుతుంది.

    1000 యేళ్ల కిందటి తెలంగాణ వేరు, ఇప్పటి తెలంగాణ వేరు.
    అప్పటి తెలంగాణ ప్రాంత రాజులు "ఆంధ్ర" దేశాధీశ్వర అనే బిరుదుని గర్వంగా ధరిస్తే, ఇప్పుడు "ఆంధ్ర" అనేది బూతు మాట గా చేసారు, ఇప్పటి తెలంగాణ నేతలు.

    గట్టిగా మాట్టాడితే, 60 యేళ్ళ కిందటి తెలంగాణ లో కమ్యూనిస్టు విప్లవం నినాదం "విశాలాంధ్రలో ప్రజారాజ్యం", ఇప్పుడా మాట అంతే బతకనిస్తారా.? అనేది అనుమానమే..!!

    విజయనగర సామ్రాజ్య నిర్మాతలు హక్కరాయ, బుక్కరాయ లు తెలంగాణ వారు (యాదవ కులస్థులు). దానికి ఎప్పుడైనా గౌరవం/ప్రాధాన్యం ఇచ్చారా.? బర్మా దాక ఎందుకు పోతున్నారు..?

    సాలగ్రామ సుబ్రహ్మణ్య శర్మ

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన మాటల్లోనే మీకు సమాధానాలు ఉన్నాయి.

      మీరు చెప్పిన అర్థాలు నవీనం - అవి తెలంగాణాను మరుగున పడేయటానికి చేసిన నవీన వాదనలు - ఇవి నవీన అర్థాలు అని చాలా వ్యాసాల్లో మీరు చదివే ఉంటారు కూడా! వాటి పూర్తి నిజాలు, తెలంగాణా పదం ఎలా రూపాంతరం చెందింది ప్రత్యెక టపాలో ఉంచగలను. తెలంగాణా పదం క్రీ..శ. 2 నాడే ప్లీనీ అనే చైనా యాత్రికుడు తెలంగాణా ప్రాంతాన్ని తెలింగ్ అని చెప్పటం జరిగింది.


      "కొడుకా.! మన నేల తెలంగాణ. మన రాజు అదృష్టం బాగోక యుద్ధంలో ఓడిపోతే, సువర్ణభూమికి వచ్చాం.." ఈ మాట సత్యమే క్రీ.పూ. 6 వ శతాబ్దికే అస్సక రాజ్యం ఏర్పాటు చేసుకున్న తెలంగాణా తెలుగు ప్రజలు ఆంద్ర రాజుల ఆక్రమణతో యుద్దంలో ఓడి పోయి తెలంగాణులు బర్మా పోయారనుట సత్యం.


      నాటి తెలంగాణా పరిధి ఎక్కువ నిజమే - తెలంగాణా వారు బర్మా వెళ్ళే నాటికి కళింగలో భాగం కూడా, అక్కడి సముద్ర భాగం ద్వారానే తెలంగాణా వారు బర్మా వెళ్లి ఉండవచ్చు. అయినా తెలంగాణా అనే ప్రాంతం వేరే ఏదైనా ఉందా? అంటే మీ మాటలు ఆంధ్ర కూడా ఒకప్పుడు తెలంగాణాలో భాగామనా?


      ఆంధ్రమాతనే గోంగూరకు అంటగట్టే స్థాయికి దిగజారింది ఆంధ్రా వారే కదా? యమగోల సినిమాతో ఆంద్రమాత గోంగూర అనే పదాన్ని విశ్వవ్యాప్తం చేసి ఆంధ్రమాతను అవమాన పరచింది ఆంధ్రులే కదా, ఇప్పుడు నెట్లో ఆంధ్రమాత అని సర్చ్ చేసి చూడండి ఆంధ్రమాత గోంగూర అనే కనపడతాయి, ఇవే కాదు చెప్పుకుంటూ పోతే చాలా కలవు - అసలు ఆంధ్ర పదానికి అవమానం జరిగింది ఆంధ్రుల చరిత్రలోనే కాదంటారా? అవన్నీ అప్రస్తుతం.


      నా పోస్టులు చూడండి విశాలాంధ్ర ఎవరు కావాలనుకున్నారో - ఎవరు వద్దనుకున్నారో? ఆ నాటి కమ్యునిస్టులు కోరుకున్నారంటే తెలంగాణా వారు కోరుకున్నాట్టా? కమ్యూనిస్టు అంటే ఒక పార్టీ మాత్రమె. 1955 గోలకొండ పత్రికలు తిరగేయండి ప్రతిరోజూ విశాలాంధ్ర వద్దనే నినాదమే కనిపిస్తుంది - ప్రజల నోట.


      నేను ఇంకా క్రీ.పూ. లోనే ఉన్నాను మీరు చెప్పిన ఆంధ్ర రాజులు, విజయనగర రాజుల విషయం ముందు వస్తుంది కదా?

      Delete